Talented Artist: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. నటన, పెయింటింగ్, మ్యూజిక్ లో నైపుణ్యం ఉన్న కొందరు సోషల్ మీడియాలో ప్రతిభ చాటుతుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఒక కళాకారుడు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. దానిని చూసి అందరూ షాక్ అయ్యారు. సాధారణంగా పెయింటింగ్‌లు పెయింటింగ్ కార్డ్‌బోర్డ్, ఛార్ట్‌లపై వేస్తారు. కానీ ఈ కళాకారుడు ఒక ఫ్రైయింగ్ పాన్‌పై వేశాడు. రంగులు వాడలేదు. ఓ గుడ్డును ఉపయోగించి బోమ్మ గీశాడు.
READ MORE: Kaloji University : మెడికల్ సీట్స్ కోసం కౌంట్‌డౌన్ మొదలు.. మీ పేరు లిస్ట్‌లో ఉందా.?
వీడియో ప్రకారం.. ఆ కళాకారుడు మొదట గుడ్డును పగలగొట్టి పచ్చసొనను వేరు చేస్తాడు. ఆ పచ్చసోనాతో పాన్‌పై పెయింటింగ్ వేస్తాడు. అనంతరం దానిపై తెల్లసోనాను పోస్తాడు. దీంతో మోనాలిసా చిత్రం అద్భుతంగా వస్తుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కళాకారుడు.. దానికి ‘ఆమ్లెట్ డా విన్సీ’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. కొద్దిసేపటిలోనే వైరల్ అయిన దీన్ని రెండు కోట్లకు పైగా వీక్షించారు. ఈ ప్రత్యేకమైన కళపై నెటిజన్లు కామెంట్ల ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఓ మై గాడ్!” నెక్ట్స్ లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
