NTV Telugu Site icon

Haridwar: హరిద్వార్-రూర్కీ బ్రిడ్జ్‌పై ప్రమాదకర రీల్స్.. ఐదుగురు అరెస్ట్

Haridwar

Haridwar

సోషల్ మీడియా పిచ్చిలో పడి నేటి యువత ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓ వైపు పోలీసులు హెచ్చరించినా.. కేసులు బనాయిస్తున్నా.. యువతలో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అదే లోకంగా రీల్స్ చేస్తూ కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా హరిద్వార్‌లో ప్రమాదకర విన్యాసం చేస్తూ కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Sanjay Singh: కొత్త చిక్కుల్లో ఆప్ ఎంపీ.. గోవా సీఎం భార్య పరువునష్టం కేసు

హరిద్వార్-రూర్కీ వంతెనపై ఇద్దరు అమ్మాయిలు.. ముగ్గురు అబ్బాయిలు అశ్లీలమైన రీల్స్ చేశారు. ప్రమాదకర స్థితిలో విన్యాసాలకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలతో కూడిన సోషల్ మీడియా గ్రూప్‌లో 528K ఫాలోవర్లు ఉన్నారు. అనుచితమైన కంటెంట్, ప్రమాదకర చర్యలతో కూడిన రీల్స్‌ చేస్తుంటారు. డిసెంబరు 16న సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో ప్రత్యక్షమైంది. జంట వంతెనపై కూర్చున్నట్లు చిత్రీకరించబడింది. మూడవ వ్యక్తి బాలుడిని నదిలోకి తోసేశాడు. అమ్మాయి.. తోసేసిన వ్యక్తిని వెంటాడుతుంది. దృశ్యాల్లో ఉన్న వారిపై రూర్కీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అశ్లీలతను వ్యాప్తి చేయడం మరియు ప్రాణాలకు హాని కలిగించడం కింద కేసు నమోదు చేశారు.

 

Show comments