NTV Telugu Site icon

Red ant chutney: ఎర్ర చీమల చట్నీ తిన్నారా? జీఐ ట్యాగ్ సాధించిన ఈ చట్నీలో పోషకవిలువలు!

Red Ant Chutney

Red Ant Chutney

చట్నీల్లో మామిడి, టమాట, నిమ్మలాంటివి చూశాం.. తిన్నాం. ఇక నాన్ వెజ్ లో కూడా కొన్ని రకాల చట్నీలు ఉన్నాయని తెలుసు. కానీ వెరైటీగా చీమల పచ్చడి కూడా ఉందట. అది కూడా మన భారతదేశంలోని కొందరు తింటున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆ చట్నీ రుచి అద్భుతంగా ఉంటుందని.. అనేక వ్యాధులను నయం చేస్తుందని అంటున్నారు. అయితే రెడ్ యాంట్ చట్నీ టేస్ట్ సంగతి పక్కనపెడితే.. వాటిని చెట్నీ తయారు చేయడం చూస్తే కచ్చితంగా తినడం మానేస్తారు. ఐతే ఇప్పుడు ఈ రెడ్ యాంట్ చట్నీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

వీడియో వైరల్..
సోషల్ మీడియాలో ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకూ ఈ వీడియోను చాలా మంది చూశారు. లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోను @foodguyrishi ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. షేర్ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఎర్రల చీమల చట్నీలు ఎలా తయారు చేస్తారో.. వీడియోలో ఉంటే.. వ్లాగర్ వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇంతకీ ఇప్పుడు ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ వీడియోలో చూపిన విధంగా….
ఈ వీడియోలో ఒక మహిళ ఒక కర్ర.. బకెట్ పట్టుకుని మామిడి చెట్టు దగ్గరకు వెళ్లింది. అక్కడ ఒక చెట్టు భాగంలో చీమలు బాగా పట్టి ఉంటాయి. దాన్ని తెంపి వాటర్ ఉన్న ఒక బకెట్‌లోకి వేస్తుంది. వెంటనే ఆ చీమల్ని కడిగి.. ఒక వస్త్రంపై ఆర పెడుతుంది. ఆ తర్వాత పచ్చడి చేసే రోటిలో ఎండు మిర్చి, పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా నూరుతుంది. ఇది బాగా పేస్టులా అయ్యాక అందులో ఆరబెట్టిన చీమల్ని కూడా వేసి బాగా రుబ్బుతుంది. అంతే ఎంతో రుచిగా ఉండే ఎర్ర చీమల చట్నీ సిద్ధం. ఈ చట్నీని అక్కడ ఉన్న చిన్నా, పెద్దా అందరూ తినేస్తున్నారు. ఇలా ఎర్ర చీమల చట్నీ తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావని వాళ్లు నమ్ముతున్నారు.

ఈ చట్నీకి జీఐ ట్యాగ్..
రెడ్ వీవర్ యాంట్ చట్నీ(సిమిలిపాల్ కై చట్నీ) అంటే కాస్త వింతగా, విడ్డూరంగా ఉన్నా.. దీనిలో పోషక, ఔషద గుణాలు ఎన్నో ఉన్నాయి. దీని రుచి, పోషక విలువల వల్లనే ఈ చట్నీ ప్రసిద్ధి చెందింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న మయూర్​భంజ్ కై సొసైటీ లిమిటెడ్ 2020లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్​ యాక్ట్​, 1999 కింద సిమిలిపాల్ కై చట్నీని GI రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసింది. చట్నీ ప్రత్యేకతను హైలైట్ చేస్తూ.. దీనిని అప్లై చేశారు. దరఖాస్తు మూల్యాంకన తర్వాత.. దానిని ఆమోదించి.. ఆహార ఉత్పత్తుల వర్గీకరణలో ఈ చట్నీని అధికారికంగా పేరు సంపాదించుకుంది.

చట్నీలోని పోషకవిలువలు..
సిమిలిపాల్ కై చట్నీకి వినియోగించే చీమల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, అమైనో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. డిప్రెషన్, అలసట, జ్ఞాపకశక్తిని కోల్పోవడం వంటి వాటి నిర్వహణలో సమర్థవంతంగా పని చేస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గిరిజనులు పోషకాహార అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇది వ్యాధులకు విరుద్ధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రుమాటిజం, చర్మ సమస్యలు, కడుపు సమస్యలకు దీనినుంచి ఉపశమనం కలుగుతుంది.

Show comments