అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. దేశవ్యాప్తంగా మహిళలు సన్మానాలతో సంబరాలు అంబరాన్నంటాయి.. కొన్ని వేదికలపై విభిన్న రకాలుగా మహిళా మణులు తమలోని టాలెంట్ ను బయటకు తీస్తుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళా దినోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ కలెక్టర్ మాత్రం అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో పాల్గొని డ్యాన్స్ చేశారు. పుదుకొట్టే జిల్లాలో కలెక్టర్ కవితా రాము ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉద్యోగులతో పాటు పురుషులు కూడా డ్యాన్స్ చేశారు. అనంతరం కలెక్టర్ కూడా డ్యాన్స్ చేయాలని కోరడంతో తాజాగా దళపతి విజయ్ హీరోగా నటించిన వారసుడు మూవీలోని రంజితమే అనే సాంగ్ కు కలెక్టర్ కవితా రాము డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : Kidnap: పెళ్లి పేరుతో బాలికలకు ఎర.. ఆ తర్వాత అస్సాంకే
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కార్యకర్తలు కలెక్టర్ కు బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం సినిమాలోని పాటకు అధికారులతో కలిసి కలెక్టర్ స్టేప్పులు వేయడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కలెక్టర్ డ్యాన్స్ చేయడంతో అందరు ఆమె ఎంజాయ్ చేశారు. అంతకు ముందు మహిళా దినోత్సవం నేపథ్యంలో పలు పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంఎస్, పెరియసామి, వ్యవసాయశాఖ అసోసియేట్ డైరెక్టర్, జిల్లా అభివృద్ది తదితరులు పాల్గొన్నారు.
Also Read : Oscars 95: తొంభై శాతం ఆస్కార్ ఫలితాలు ఇలాగే ఉంటాయట!!