కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియాలోని పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అంటే ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని ఉద్యోగులకు కంపెనీలు కల్పించాయి. గతంతో పోలిస్తే కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఆ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రమే ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నాయి. అయితే నెదర్లాండ్స్‌లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానం ఉద్యోగుల హక్కుగా మారనుంది. ఈ ప్రతిపాదనపై డచ్ పార్లమెంట్ దిగువ సభ గత వారం తీర్మానం చేసింది. దీనికి సెనేట్ ఆమోదం తెలపగానే చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఉద్యోగుల హక్కులకు ప్రాధాన్యం ఇచ్చే దేశంగా నెదర్లాండ్స్‌కు పేరుంది.
Fake IPL : ఫేక్ ఐపీఎల్ ఆట.. కేటుగాళ్ల వసూళ్ల వేట..
ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థకు ‘వర్క్ ఫ్రం హోం’ కోరుతూ అభ్యర్థన పెట్టుకుంటే కారణం చెప్పకుండానే పలు కంపెనీలు ఉద్యోగుల అభ్యర్థనను నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నాయి. ఈ జాబితాలో టెస్లా వంటి ప్రముఖ కంపెనీ కూడా ఉంది. ఇటీవల టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తమ ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని లేదా కంపెనీని విడిచిపోవాలని హెచ్చరించారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా వర్క్ ఫ్రమ్ హోం విధానంపై నెదర్లాండ్స్ పార్లమెంట్ చేసిన చట్టానికి సెనేట్ ఆమోదం తెలిపితే.. ఈ చట్టం ప్రకారం ఉద్యోగుల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అభ్యర్థనను కంపెనీలు తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది.
