Site icon NTV Telugu

Nagpur: మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు దొంగగా మారిన భర్త..

Nagpur

Nagpur

Nagpur: వివాహ బంధంలో కలహాలు వచ్చినప్పుడు విడాకులు తీసుకోవడం అనేక కుటుంబాల్లో కనిపిస్తుంది. ఇక, విడాకులు తీసుకున్న తరువాత చాలా మంది భర్తలు కోర్టు ఆదేశాలతో మేరకు తమ మాజీ భార్యలకు భరణం చెల్లిస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది వారికి తలకు మించిన భారం అవుతుంది. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌ నగరంలోని గణపతినగర్‌కు చెందిన కన్హయ్య నారాయణ్ బౌరాషి అనే వ్యక్తి కోర్టు ఆదేశాల ప్రకారం తన మొదటి భార్యకు నెలకు రూ.6 వేల భరణం చెల్లించాల్సి ఉంది. ఇక, తాను నిరుద్యోగిగా ఉండటంతో ఆ డబ్బులు ఎలాగైనా ఇవ్వాలని చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఇటీవల మనీష్‌నగర్‌లో జరిగిన ఓ చైన్ స్నాచింగ్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Shah Rukh Khan : ‘కింగ్’ మూవీ కి బ్రేక్.. షూటింగ్‌లో షారుఖ్‌కు అపశ్రుతి..?

అయితే, 2024 ఫిబ్రవరి 22వ తేదీన 74 ఏళ్ల వృద్ధురాలు జయశ్రీ జయకుమార్ గడే మెడలో ఉన్న బంగారు గొలుసును బైక్‌పై వచ్చి లాక్కెళ్లాడు. బెల్టరోడి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో కన్హయ్యను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అతను తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాదు, కోవిడ్‌ సమయంలో వివాహం చేసుకోగా.. గొడవ వల్ల భార్యతో విడాకాలు తీసుకున్నాడు.. ఇక, కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ భార్యకు నెలవారీ భరణం చెల్లించాల్సి రావడంతో.. రెండేళ్లుగా ఉద్యోగం లేకపోవడంతో.. డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

Read Also: EX Minister Sailajanath: చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి

ఇక, అతడు దొంగిలించిన బంగారు చైన్ లలో కొన్నింటిని స్థానిక నగల దుకాణంలో విక్రయించినట్లు పోలీసులు చెప్పుకొచ్చాడు. దొంగ సొమ్ము కొనుగోలు చేసినందుకు ఆ షాప్ యాజమానిని కూడా అరెస్ట్ చేశారు. అయితే, కన్హయ్య దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్, 10 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కన్హయ్యతో పాటు నగల వ్యాపారి ఇద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు. తదిపరి దర్యాప్తు కోసం వారిని బెల్టరోడి పోలీసులకు అప్పజెప్పారు.

Exit mobile version