Viral News: మండుటెండలో చెట్టు నుంచి వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెట్లు మనకు ప్రాణవాయువుని అందిస్తాయి, మండుటెండ నుంచి కాపాడుకోవడానికి నీడనిస్తాయి, చల్లటి గాలిని ఇస్తాయి, వర్షాల్నీ కురిపిస్తాయి.. ఇవన్నీ అందరికీ తెలిసిందే! కానీ, ఓ చెట్టు నుంచి వర్షపు జల్లులు కురుస్తున్నాయంటే నమ్ముతారా? మీరు నమ్మినా, నమ్మకపోయినా.. ఇది మాత్రం నిజం. కర్ణాటక కొడగు సమీపంలోని హెరవనాడు గ్రామంలో ఓ చెట్టు నుంచి నిరంతరాయంగా వర్షపు జల్లులు కురుస్తున్నాయి. చెట్టు కొమ్మల నుంచి 10 చదరపు అడుగుల విస్తీర్ణంలో నీరు పడుతోంది. కొన్ని వారాలు నుంచి ఆ చెట్టు నుంచి ఇలా వర్షపు జల్లులు కురుస్తున్నాయి. ఎండలు మండిపోతున్నా సరే, ఆ చెట్టు నుంచి వర్షపు జల్లులు కురవడం మాత్రం ఆగడం లేదు.
ఈ చెట్టు శివుడికి ఇష్టమైన బిల్వ పత్ర వృక్షమని అక్కడి స్థానికులు చెప్తున్నారు. చెట్టుకు 500 మీటర్ల దూరంలోని దేవరకాడులో భద్రకాళిదేవి కొలువై ఉంది. ఆ అమ్మవారి మహిమ వల్లే.. ఇలా జరుగుతుందని గ్రామస్థులు నమ్ముతున్నారు. ఆలయ పూజారిని ఈ చెట్టు గురించి అడగ్గా.. అది బిల్వ పత్ర వృక్షాన్ని పోలి ఉందని, అక్కడ శివలింగం లేదా జలపాతం ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కొన్ని రకాలైన చెట్లకు ఇలాంటి లక్షణాలు ఉంటాయని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ చెట్టు నుంచి పడే నీటిని పరీక్షించేందుకు ప్రయోగశాలకు పంపారు. త్వరలోనే ఈ చెట్టుని విపత్తు నిర్వహణ అథారిటీ, పర్యావరణ అధికారులు సందర్శించనున్నారు.
Also Read
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
తాజావార్తలు
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..