Funny Video: మహిళలు అలవాట్లు ఎలా ఉంటాయంటే చెప్పుకుంటూ పోతే కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఘటనలు ఛీ అనిపిస్తాయి, ఇదేం ఆడదిరా బాబు అనిపిస్తాయి ఇప్పుడు చెసే ఈఘటన అలాంటిదే అని చెప్పాలి. ఈకాలంలో మహిళలు చాలా మంది సీరియల్ కి పరిమితమై కుటుంబంలోని వారికి పక్కన పెడుతున్నారు. పిల్లలు ఏడుస్తు్న్న, భర్త ఆకలి అని పిలిచినా బంధువులు ఉన్నా.. అవేంపట్టదు వాళ్లకు మాత్రం ముచ్చట్లు, సీరియల్స్ ఉంటే చాలు అదే జీవితం అనుకుంటూ కాలం గడుపుతుంటారు. ఇక మరికొందరైతే ఫోన్ చేతిలో ఉంటే పక్కన వాల్లు ఏంచేస్తున్నారనేది దేవుడెరుగు కానీ.. ఫోన్ చూస్తు అసలు వాల్లు ఏం పని చేస్తున్నారనేది మర్చిపోతుంటారు. అలాంటి ఫన్నీ వీడియోలు కూడా మనం చూస్తుంటాము. ఇప్పుడు మనం చూసే వీడియోకూడా అలాంటిదే..
Read also:Veg and Non Veg Markets : 144 సైట్లలో వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్లు
సాధారణంగా పాలు ఎలా తాగుతారు? అదే ప్రశ్న అంటారా? ఒకవేళ అడిగితే నోటితోనే అని సమాధానం చెబుతారు. అయితే ఓ తల్లి మాత్రం తన చంటి బిడ్డకు చెవి ద్వారా పాలు తాగిస్తోంది. షాక్ తిన్నారా? అదెలాగంటారా? తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది..ఈ వీడియో చూసి నెటిజన్లు హవ్వ అంటూ నోరు ఎల్లబెడుతున్నారు. అదే సమయంలో అందులో కనిపిస్తున్న ఆ మాతృమూర్తి తీరుపై కొంచెం ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. మరే.. ఆమె చేసిన పని అలా ఉంది. అయితే.. చిన్నారికి పాలు పట్టించాల్సిన ఆ తల్లి కబుర్లలో మునిగిపోయి వింత పని చేసింది. దీంతో.. నోటితో తాగాల్సిన పాలను చెవితో తాగించే ప్రయత్నం చేసింది. ఈనేపథ్యంలో.. పిల్లలకు పాలు తాగించే పాల డబ్బాను నోట్లో పెట్టకుండా చిన్నారి చెవిలో పెట్టింది. అంతేకాదు అదిచూసుకోకుండా.. తన పాటికి తాను పక్కన వారితో కబుర్లు చెబుతోంది. ఒళ్లో వున్న చిన్నారి పాలు తాగుతుందా? లేదా? అని అస్సలు పట్టించుకోలేదు..
Read also: Encounter: బీజాపూర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
తాను పాలడబ్బా ఎక్కడ పెట్టాను అనే సోయే లేదు ఆమాతృమూర్తికి. పీకల్లోతు ముచ్చట్లలో మునిగిపోయింది. అయితే ఈ ఇదంగా పక్కనే ఉన్న కొందరు వీడియో తీశారు. ఆ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. అయితే.. చిన్నారికి పాలు పట్టించిన తల్లి కాసేపటికి తేరుకుని నాలుక కరుచుకుంది. అయ్యో అని వెంటనే పాల డబ్బాను నోట్లో పెట్టి చిన్నారికి పాలు తాగించింది. ఆమె చేసిన పనికి సిగ్గుపడుతూ నవ్వుకుంది. దీంతీ ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తల్లి చేసిన వ్యవహరించిన తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక, పిల్లల విషయంలో ఇలా వ్యవహరించడం ఏంటంటూ కొందరు సీరియస్ అవుతుంటే, కబుర్లుంటే చాలు ప్రపంచంతో సంబంధమే ఉండదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.