Site icon NTV Telugu

ఉద్యోగుల‌కు మీషో బంప‌ర్ ఆఫ‌ర్‌… ఇక‌పై ఎక్క‌డి నుంచైనా…

క‌రోనా కార‌ణంగా చాలా కంపెనీలు వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్‌ను ఇచ్చేశాయి. ముఖ్యంగా ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థ‌ల ఉద్యోగులు గ‌త రెండేళ్లుగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ట్విట్ట‌ర్ సంస్థ త‌మ ఉద్యోగుల‌కు జీవితకాలం వ‌ర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చేసింది. ఈ బాట‌లో మ‌రో ఈ కామ‌ర్స్ సంస్థ మీషో కూడా ప‌య‌నిస్తున్న‌ది. మీషోలో ప‌నిచేసే ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ఇచ్చింది. దేశ‌వ్యాప్తంగా ఉద్యోగులు ఇక‌పై ఎక్క‌డి నుంచైనా పనిచేసుకునే వెసులుబాటును క‌ల్పించింది.

Read: వైర‌ల్‌: ఆమె ధైర్యానికి సోష‌ల్ మీడియా ఫిదా… కోబ్రాను ఇలా ప‌ట్టుకొని…

ఈ విష‌యాన్ని మీషో వ్య‌వ‌స్థాప‌కుడు విదిత్ ఆత్రే ట్వీట్ట‌ర్ ద్వారా ఉద్యోగుల‌కు తెలియ‌జేశారు. ఉద్యోగులు సౌక‌ర్య‌వంతంగా ప‌నిచేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మీషో ప్ర‌క‌టించింది. ప‌నిచేసే స్థానం కంటే ఉద్యోగుల మాన‌సిక‌, శారీర‌క భ‌ద్ర‌త ముఖ్య‌మ‌ని ఆత్రే తెలిపారు. బెంగ‌ళూరులో ప్రధాన కార్యాల‌యం ఉన్నప్ప‌టికీ, అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో చిన్న‌చిన్న కార్యాల‌యాలు తెరుస్తామ‌ని తెలిపారు.

Exit mobile version