Site icon NTV Telugu

Train Accident: పట్టాలపై బైక్ వదిలేశాడు.. లేకపోతే ఆ వ్యక్తి ఏమయ్యేవాడో..?

Train Accident

Train Accident

Train Accident: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా పరిధి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ రైలు గేటు వేసి ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా రైలు గేటు దాటుతుంటారు. ఈ మేరకు ఓ వ్యక్తి ఓ ట్రాక్‌పై రైలు వెళ్తున్నా.. మరో ట్రాక్‌పై నుంచి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ట్రాక్‌పై సడెన్‌గా రైలు దూసుకొచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు స్పష్టంగా తెలియవు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్‌లు షాక్ అవుతున్నారు.

వీడియోలో ఓ వ్యక్తి బైకును నడిపించుకుంటూ ట్రాక్‌పై వెళ్తున్నాడు. ఆ ట్రాక్‌పై రైలు వస్తోందని పక్కనే ఉన్న వాళ్లు అరుస్తుండటంతో ఆ వ్యక్తి తికమక పడ్డాడు. ఎటు వెళ్లాలో తెలియక వెనక్కు తిరగబోయాడు. ఆ సమయంలో అతని బైక్ రైలు పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. దాన్ని పక్కకు లాగలేకపోవడంతో అక్కడే వదిలేసి పక్కకు పరిగెత్తాడు. వేగంగా దూసుకొచ్చిన ఆ రైలు ఆ వ్యక్తి బైక్‌ను ఢీకొట్టింది. అందరూ చూస్తుండగానే ఆ బైక్ రైలు కింద పడి నుజ్జు నుజ్జు అయ్యింది. సదరు వ్యక్తి ఒక్క క్షణం ఆ పట్టాలపై ఉండి ఉంటే ఘోరం జరిగిపోయేది. అయితే కొందరు ఈ ఘటన యూపీలోని ఎటావాలో జరిగిందని ప్రచారం చేస్తున్నారు.

Exit mobile version