NTV Telugu Site icon

Viral Video: దెబ్బకు వైరల్‌ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)

Superglue

Superglue

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని పరిణామాలు షాకింగ్‌గా ఉంటాయి. ఫిలిప్పీన్స్‌లోని ఓ యువకుడు చేసిన పనికి అందరూ తిట్టి పోస్తున్నారు. సూపర్ గ్లూ ( ఫెవిక్విక్ లాంటి పదార్థం)ను పెదాలపై వేసుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ చర్యతో ఆ యువకుడిని ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వస్తున్నాయి.

READ MORE: BRS: 28న నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా..

ఆ యువకుడు తన పెదవులపై సూపర్ గ్లూ ( ఫెవిక్విక్ లాంటి పదార్థం) అప్లై చేశాడు. దీంతో రెండు పెదాలు గట్టిగా అతుక్కున్నాయి. పక్కన ఉన్న వాళ్లు నవ్వడం మొదలు పెట్టారు. ఫస్ట్ ఈ యువకుడు కూడా నవ్వినా.. కొద్ది క్షణాల్లోనే ఆ నవ్వు ఇబ్బందిగా మారింది. అతను తన పెదవులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు.. అవి తెరుచుకోలేదు. అతను పదేపదే ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. ఈ వీడియోను “బాడీస్ టీవీ” అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భాగస్వామ్యం చేశారు. దీనిని మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు. ఈ ఘటనను చూసి కొందరు పగలబడి నవ్వుతుండగా.. మరికొందరు యువకుడి అవివేకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వినియోగదారు “వైరల్ కావాలనే కోరికతో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఎంత తప్పు.” అని కామెంట్ చేశాడు. “వైద్యులు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలరు.. దీంతో యువకుడు జీవితంలో పాఠం నేర్చుకుంటాడు.” అని మరో వినియోగదారు పేర్కొన్నాడు.

READ MORE: UPSC CSE 2025: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. 1129 పోస్టులతో.. సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్