NTV Telugu Site icon

Crow is The Bird That Made The Story Come True: కాకి కథను నిజం చేసిన పక్షి.. చూడాల్సిన వీడియో ఇది

Crow Is The Bird

Crow Is The Bird

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం చాలా సేపు వెతికింది. చాలాసేపటికి ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండ వద్దకు వెళ్లింది. కుండలో కాకి ముక్కుపెట్టి తాగబోయింది. కానీ.. నీళ్ళు బాగ అడుగున వున్నాయి కాకిముక్కుకు అంద లేదు.
తెలివైన కాకి తన దాహం ఎలాగైనా తీర్చుకోవాలనుకుంది. అక్కడే పడివున్న గులకరాళ్లను తన ముక్కుతో తీసుకువచ్చి నీళ్లకుండలో వేయసాగింది. దీంతో క్రమంగా ఆనీరు కుండపైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. ఇది కాకి కథ.

read also: Boycott Alia Bhatt: భర్తని హింసించిన ఆలియా.. బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్

అయితే దీనినే ఓ పక్షి కూడా వాడుకుంది. పక్షికి దాహం వేస్తుండటంతో ఏం చేయాలో అర్థంకాలేదు. వెతుకుతుండగా అక్కడ ఓబాటిల్‌ లో నీరు కనిపిచాయి. కానీ ఆబాటిల్‌ లో నీరు కొంచెం కిందికి వున్నాయి. కాకి ఐడియాను పక్షి కూడా ఫాలో అయ్యింది. అక్కడే ఉన్న చిన్న చిన్న గులక రాళ్లను బాటిల్లో వేస్తూ వచ్చింది. నీళ్లు పైకి రావడంతో.. నీల్లు తాగి అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఈ వీడియో కాస్తా ఇప్పడు వైరల్‌ గా మారింది. కాకి కథ విన్నాం కానీ.. మనం చూడలేదు. అయితే మగ్పీ అనే పక్షి ఆ కథను నిజం చేస్తూ తన దాహం తీర్చుకోవడాన్ని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మాగ్పీ తెలివితేటలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వావ్‌ ఒక్కొక్కటిగా రాళ్లను వేస్తూ, నీటి మట్టాన్ని పెంచిన తీరు ఆశ్చర్యపరిచింది, ఈ పక్షి నిజంగా మేధావి అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
అయితే.. ఈ వీడియోను క్రీచర్స్ ఆఫ్ గాడ్ అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో.. ఈవీడియో ఎంతగా వైరల్‌గా మారిందంటే ఇప్పుడు ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.