కుక్కల్ని పెంచుకుంటారు కొందరు.. పిల్లుల్ని కూడా పెంచుకుంటారు మరికొందరు. అయితే మానవ జీవితంతో పెంపుడు జంతువులు ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. ఇక శునకాలతో అనుబంధం చాలా గాఢంగా పెనవేసుకుపోతుంటుంది. కొందరు శునకాలకు ఏమైనా అయితే అసలు తట్టుకోలేరు. ఓ చిన్నారి పిల్లులతో చేస్తున్న సహవాసం అందరినీ ఆకట్టుకుంటోంది. తన పెంపుడు పిల్లులను ఒక టేబులపై కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఒక ఫ్లవర్ ని ఎలా గీయాలని ఆ చిన్నారి పిల్లులకు నేర్పుతోంది. బ్లాక్ బోర్డుపై ఆ చిన్నారి ఫ్లవర్ బొమ్మ గీస్తుంటో.. ఆ పిల్లులు ఎంతో ఆసక్తిగా దానిని గమనించడం హాట్ టాపిక్ అవుతోంది. పిల్లులు తమ ఏకాగ్రతను అంతా బోర్డుమీద కేంద్రీకరించాయి.
Read Also: Vaishali Case : కిడ్నాప్ కేసులో 31 మంది అరెస్ట్.. 10 సెక్షన్ల కింద కేసులు
క్యాట్ లతో పాటు చింపాంజీలు, చిలుకలు కూడా మనం ఏం చెబితే అది చేస్తుంటాయి. మనం కాస్త ఆసక్తి కనబరచాలే గానీ శునకాలు కూడా సూపర్ మార్కెట్ కి వెళ్లి మనం తీసుకురామన్న కూరగాయలు కూడా తెస్తుంటాయి. ఇటీవల ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను ఫిదా చేసింది. చక్కగా చేతిలో ఒక బాస్కెట్ పట్టుకుని శునకం రోడ్డు్మీదకు వెళ్లి మరీ షాపింగ్ చేసుకుని వచ్చింది. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ముచ్చట వేయకమానదు. ఈ చిన్నారి డ్రాయింగ్ టీచర్ లా మారడం అందరినీ ఆకట్టుకుంటోంది. సో క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read Also: Littile Girl Teaching Her Cats: ఫ్లవర్ బొమ్మ ఎలా వేయాలంటే.. పిల్లులకు చిన్నారి పాఠాలు
