Site icon NTV Telugu

Lion Cow Viral Video: ఆవును కాపాడుకునేందుకు సింహానికి ఎదురెళ్లిన రైతు.. నీ ధైర్యానికి పెద్ద హ్యాట్సాఫ్ బాసూ!

Untitled Design (2)

Untitled Design (2)

Viral Video, Farmer Saves Cow From Lion: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలతో పాటుగా పెంపుడు జంతువులను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి చిన్న ఇబ్బంది కలిగినా అస్సలు తట్టుకోలేరు. ఇక తమ పెంపుడు జంతువుకు ఆపద వస్తే ఊరుకుంటారా?.. తక్షణమే స్పందిస్తారు. ఎదురుగా ఎవరున్నా, ఎలాంటి జంతువు ఉన్నా.. అస్సలు వెనకడుగు వేయరు. ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఓ రైతు తన ఆవును కాపాడుకునేందుకు ఏకంగా సింహానికే ఎదురెళ్లాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం… రోడ్డుపై ఓ ఆవు గొంతును సింహం పట్టుకుంటుంది. నొప్పితో విలవిల్లాడిపోయిన ఆవు పెద్దగా అరుస్తుంటుంది. ఆవు అరుపులు విన్న యజమాని.. వెంటనే అక్కడికి పరుగెత్తుకొస్తాడు. ఆవు గొంతును సింహం పట్టుకొని ఉండడం చూసి కాస్త బయడతాడు. అయితే ఎలాగైనా తన ఆవును కాపాడుకోవాలని ముందడుగు వేస్తాడు. చెయ్యెత్తి పైకెత్తి గట్టిగా అరుస్తూ సింహాన్ని బయపెడుతాడు. అదే సమయంలో సింహం నుంచి తప్పించుకునేందుకు ఆవు ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఆవు రోడ్డు పక్కకు జరుగుతుంది.

రోడ్డు పక్కనే ఉన్న రాయి తీసుకుని సింహం వైపుగా రైతు వెళ్తాడు. రైతును చూసిన సింహం భయపడిపోయి ఆవు గొంతును విడిచిపెట్టి వెళ్లిపోతుంది. దాంతో ఆవు ప్రాణాపాయం నుంచి బయటపడుతుంది. ఈ వీడియోను ‘వివేక్‌ కొటాడియా’ అనే యూసర్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా అలీదార్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన వారు రైతు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘నీ ధైర్యానికి పెద్ద హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version