NTV Telugu Site icon

Langur Viral Video: అచ్చు మనిషి లానే.. పానీపూరి ఇష్టంగా తింటున్న కొండముచ్చు! వీడియో చూస్తే షాకే

Untitled Design (2)

Untitled Design (2)

Monkey Eats Panipuri in Ghaziabad: ఈ రోజుల్లో ‘పానీపూరి’ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. పానీపూరి బండి కనిపిస్తేనే మనసు అటే లాగుతుంది. తినేవరకు మనసున పట్టదు. పానీ పూరీలో వేడివేడి పప్పు మిశ్రమం, సన్నని ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటే.. ఆ మజానే వేరు. చలికాలంలో అయితే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. మనుషులే కాదు జంతువులకు కూడా పానీపూరీని ఇష్టపడుతున్నాయి. గతంలో ఓ ఏనుగు పానీపూరి తినగా.. తాజాగా ఓ కొండముచ్చు ఎంతో ఇష్టంగా తింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఓ కొండముచ్చు పానీపూరి ఇష్టంగా తింది. టంకరాలోని దయానంద్ చౌక్ వద్ద ఓ పానీపూరి బండి వద్దకు పెద్ద కొండముచ్చు వచ్చింది. పానీపూరి బండిపైకి ఎక్కి కూర్చుంది. చాట్ విక్రయించే వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా.. దానికి పానీపూరితో కూడిన ప్లేట్ ఇచ్చాడు. వాటిని ఆ కొండముచ్చు ఎంతో ఇష్టంగా తింది. ఒక్కొకటి తింటూ మొత్తం ప్లేట్‌లోని పానీపూరిలను ఖతం చేసింది. దీనిని చూసేందుకు స్థానికులు అక్కడ గుమిగూడారు.

Also Read: Lovers Romance Viral Video: గట్టిగా హత్తుకుని ముద్దులు.. బైక్‌పైనే లవర్స్ ఘాటు రొమాన్స్! 21 వేల ఫైన్

కొండముచ్చు పానీపూరి తింటుండగా.. ఆ దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది జనం చాట్ బండి వద్ద గుమికూడారు. కొందరు ఆనందంతో, మరికొందరు ఆశ్చర్యంగా దానిని చూశారు. చాలామంది ఈ సన్నివేశాన్ని తమ మొబైళ్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కాగా.. చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతేకాదు భిన్నమైన కామెంట్స్‌తో వీడియోని లైక్‌, షేర్‌ చేస్తున్నారు. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

Show comments