NTV Telugu Site icon

రికార్డ్‌: ఆమెను 30 కోట్ల‌మంది ఫాలో అవుతున్నారు…

అమెరికా మోడ‌ల్ కైలే జ‌న్న‌ర్ స‌రికొత్త రికార్డ్‌ను సృష్టించింది.  సోష‌ల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 30 కోట్ల‌ ఫాలోవ‌ర్ల‌తో రికార్డ్ సాధించింది.  ఈ స్థాయిలో ఫాలోవ‌ర్ల‌కు క‌లిగిన మొద‌టి మ‌హిళగా కైలే జ‌న్న‌ర్ ఖ్యాతికెక్కింది.  ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాకు 46 కోట్ల మంది ఫాలోవ‌ర్లు ఉండ‌గా, రెండో స్థానంలో ఫుట్‌బాల్ దిగ్గ‌జం క్రిస్టియానో రోనాల్డో కు 38.6 కోట్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.  ఆ తరువాత స్థానంలో కైలే జ‌న్న‌ర్ నిలిచింది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్య‌థిక ఫాలోవ‌ర్లు క‌లిగిన మ‌హిళ‌గా పాప్ సింగ‌ర్ అరియానా గ్రాండే ఉండ‌గా, ఆమెనే కైలే అధిక‌మించింది.  ఆరియానాకు 28.9 కోట్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.  గ‌త కొంత‌కాలంగా కైలే జ‌న్న‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద‌గా యాక్టీవ్‌గా లేకున్నా ఫాలోవ‌ర్లు పెరుగుతుండ‌టం విశేషం.  త‌న ప్రొఫెష‌న‌ల్ విష‌యాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను, త‌న రిలేషిప్ గురించి కైలే ఒపెన్‌గా మాట్లాడుతూ పోస్టింగ్‌లు చేస్తుండ‌టంతో ఆమెకు ఫాలోవ‌ర్ల పెరిగిన‌ట్టు నెటిజ‌న్లు చెబుతున్నారు. 

Read: చైనాలోనూ ఒమిక్రాన్ దూకుడు… వోక్స్ వ్యాగ‌న్ నిర్ణ‌యంతో బ‌య‌ట‌ప‌డ్డ నిజం…