Site icon NTV Telugu

Kerala: ఉప్మా వద్దు బిర్యానీ కావాలన్న బుడ్డోడు.. కేరళ సర్కార్ ఏం చేసిందంటే..!

Kerala

Kerala

Kerala: అంగన్‌వాడీ కేంద్రాల్లో పెడుతున్న ఉప్మాకు బదులుగా మాకు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ ఓ బుడ్డొడు చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఆ పిల్లాడి కోరిక ప్రకారం కేరళ‌ రాష్ట్రంలోని అంగన్‌వాడీ మెనూనే మార్చేసింది అక్కడి ప్రభుత్వం. మంగళవారం అంగన్‌వాడీల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌. ఈ సందర్భంగా అంగన్‌వాడీల్లో పిల్లలకు అందించే ఆహారం మెనూ మారుస్తూ.. కొత్త మెనూను ప్రవేశ పెట్టింది.

Read Also: Sajjala Ramakrishna Reddy: మీరు విజయోత్సవాలు ఎందుకు జరపలేకపోతున్నారు.. సజ్జల ప్రశ్న..!

అయితే, కేరళలోని అలప్పుజకు చెందిన చిన్నారి శంకు మాట్లాడుతూ ఉప్మాకు బదులుగా బిర్యానీ కావాలని గత ఫిబ్రవరి నెలలో అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియో కాస్తా అక్కడి ప్రభుత్వాన్ని కదిలించింది. దీంతో కేరళ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ అంగన్‌వాడీ సెంటర్ పిల్లలకు ఇచ్చే ఫుడ్ మెనూనే మార్చేశారు. కొత్తగా రూపొందించిన జాబితాలో బిర్యానీతో పాటు ఎగ్ బిర్యానీ, పులావ్, పప్పు, పాయసం, సోయా డ్రై కర్రీ, లడ్డూలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో వారానికి 2సార్లు అందించే పాలు, గుడ్లు ఇప్పుడు వారానికి 3 సార్లు అందించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. పిల్లాడి కోరిక మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో బిర్యానీని అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వీణా జార్జ్ తెలిపింది.

Exit mobile version