కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు బిస్కెట్లు పంపిణీ చేశాడు. ఇందులో వింత ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఈ బిస్కెట్లు పంపిణీకి కారణమే పెద్ద వింత.. ఆ ఆటో డ్రైవర్ తన భార్య పుట్టింటికి వెళ్లడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషంలో అతను తన ఆటోలో ప్రయాణించిన వాళ్లకు బిస్కెట్లు పంపిణీ చేశాడు.
READ MORE: IND vs ENG: భారత్ బౌలర్ల విజృంభణ.. తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ ఆలౌట్
దీంతో పాటు తన సీటు వెనుక.. ప్రయాణికులకు కనిపించేలా ఓ కాగితాన్ని కూడా పెంట్టాడు. అందులో “నా భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. నేను సంతోషంగా ఉన్నాను” అని రాశాడు. ఓ ప్రయాణికుడు దీన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్ పోస్ట్ పై జనాలు చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ తాను కూడా కొన్ని రోజులుగా సంతోషంగా ఉన్నానని రాశాడు. “నువ్వు ఆటో డ్రైవర్ జీవితాన్ని నాశనం చేశావు. ఈ పేదవాడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని భార్యకు తెలిస్తే.. రోజూ ఆటోలోనే పడుకోవలసి వస్తుంది.” అని ఈ పోస్టును పంచుకున్న వ్యక్తిపై వినియోగదారు కామెంట్ చేశాడు.
READ MORE: Delhi Elections: అభ్యర్థులకు రూ.15 కోట్ల ఆఫర్.. బీజేపీపై ఆప్ సంచలన ఆరోపణ