Site icon NTV Telugu

Youtuber : ఇలా కూడా చేస్తారా..? నిర్జల ఏకాదశి స్పెషల్ బీర్లు పంచిన యూట్యూబర్..!

Beer

Beer

Youtuber : రాజస్థాన్‌లోని జైపూర్‌ నగరంలో యూట్యూబ్ పాపులారిటీ కోసం ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. పవిత్రమైన నిర్జల ఏకాదశి రోజున యూట్యూబ్‌ ఫేమ్ కోసం బీర్ బాటిళ్లు ఉచితంగా పంచుతూ వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మతభావనలు దెబ్బతీసేలా ఉన్న ఈ చర్యపై చర్య తీసుకున్న పోలీసులు అతనితో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.

జైపూర్‌కు చెందిన లప్పు సచిన్ అలియాస్ సచిన్ సింగ్ అనే యూట్యూబర్ నిర్జల ఏకాదశి రోజున బీర్ పంపిణీ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సాధారణంగా హిందూధర్మంలో ఈ రోజున పూర్తిగా ఉపవాసం పాటిస్తూ, నీటితో మాత్రమే ఉండే సంప్రదాయం ఉంది. అయితే ఈ పవిత్ర రోజుననే బీర్ పంపిణీ చేసి వీడియోలు షేర్ చేయడం తీవ్ర అభ్యంతరం కలిగించేలా మారింది.

Lok Sabha Elections: నారీమణులకు కేంద్రం గుడ్‌న్యూస్..! వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో..!

ఇన్‌స్టాగ్రామ్‌లో లప్పు సచిన్‌కు 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, యూట్యూబ్‌లో 6.99 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఫాలోయింగ్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే అతడు మరో ఆరుగురితో కలిసి ఆటో రిక్షా డ్రైవర్లు, రోడ్డు ప్రయాణికులకు బీర్ బాటిళ్లు పంచినట్లు పోలీసులు తెలిపారు.

వీడియో వైరల్ కావడంతో జనాల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. అనేక మంది దీనిపై మండిపడుతూ మత భావనలు కించపరిచినందుకే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన జైపూర్ సౌత్ పోలీస్ కమిషనర్ దిగంత్ ఆనంద్ నేతృత్వంలోని పోలీసులు లప్పు సచిన్‌తో పాటు మిగిలిన ఆరుగురిని అరెస్ట్ చేశారు.

ఏకాదశి రోజున సాధారణంగా ప్రజలు ఇతరులకు నీరు, మజ్జిగ, ఫలహారాలు అందిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ అందులోనూ అలాంటి పవిత్ర రోజున బీర్ పంపిణీ చేయడమంటే మరీ హద్దు దాటిన పనిగా పోలీసులు పేర్కొన్నారు. యూట్యూబ్ ఫేమ్ కోసం మతపరమైన విలువలను తక్కువచేసేలా ప్రవర్తించడాన్ని సమాజం ఖండించాలి అని వారు పేర్కొన్నారు.

Schools Reopen : వేసవి సెలవులకు గుడ్‌బై.. పండుగ వాతావరణంలో స్కూల్స్‌ రీఓపెన్‌

Exit mobile version