Site icon NTV Telugu

Indian Passport: ఒకే ట్రిప్‌.. రెండు ట్రీట్‌మెంట్‌లు.. పాస్‌పోర్ట్ చాటిన క్లాస్‌ తేడా

Indian Passport

Indian Passport

Indian Passport: ఒక దేశ పాస్‌పోర్ట్‌ ఎంత శక్తివంతంగా ఉంటుంది..? అదే పాస్‌పోర్ట్‌ ఒక్కొక్కరికి ఏ స్థాయిలో వసతి కల్పిస్తుంది? అమెరికాలో ఓ భారత సంతతికి చెందిన మహిళ అనుభవించిన వాస్తవ సంఘటన ఇది. ఆవిడ వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అది వైరల్‌గా మారింది. ఈ కథనం ఒక్క వ్యక్తి బాధను మాత్రమే కాదు… దేశాల మధ్య ఉన్న గుర్తింపు, పాస్‌పోర్ట్‌ల ప్రభావం, విమానయాన వ్యవస్థలో దానికి ఇచ్చే ప్రాధాన్యం అన్నీ చెబుతోంది.

ఏమైందంటే… అనిషా అరోరా అనే భారతీయ మహిళ అమెరికా నుంచి జర్మనీకి ప్రయాణించాల్సి ఉండగా, న్యూయార్క్ విమానాశ్రయంలో ఆమె కనేక్టింగ్‌ ఫ్లైట్‌ మిస్సయ్యింది. ఆమెతో పాటు మరికొంతమంది ప్రయాణికులకూ ఇదే పరిస్థితి ఎదురైంది. విమానయాన సంస్థ దీనికి పరిష్కారంగా వారికి హోటల్‌ వసతి కల్పించింది.

THE HUNT : రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా ‘ది హంట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కానీ సమస్య అక్కడే మొదలైంది… అమెరికన్ పాస్‌పోర్ట్‌కు ఫైవ్‌ స్టార్‌, భారతీయ పాస్‌పోర్ట్‌కు సాధారణ గది..! అనిషా అరోరా భారత పాస్‌పోర్ట్‌ కలిగి ఉండగా… ఆమెతో ఉన్న ఇతర ప్రయాణికులు అమెరికన్ పాస్‌పోర్ట్‌ కలిగి ఉన్నారు. అందుకే వారికి ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో లగ్జరీ వసతి, ఉచిత భోజనం, సర్వీసులు అందించగా… అనిషాకి మాత్రం విమానాశ్రయంలోనే చిన్న గదిలో నిద్రించాల్సి వచ్చింది.

ఆమె తన చిన్న గదిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఇలా చెప్పింది: “ఇంతవరకూ నా పాస్‌పోర్ట్ గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఈ సంఘటన తర్వాత నాకు అర్థమైంది… పాస్‌పోర్ట్‌ వల్ల ఎంత తేడా వస్తుందో! ఒకే విమానం మిస్సైనా… పాస్‌పోర్ట్‌ బట్టే వసతి స్థాయి నిర్ణయిస్తారా?”

ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చాలా మంది భారత పాస్‌పోర్ట్‌కు ఉన్న హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నారు. వీసా సమస్యలు, ప్రయాణ అనుమతులు, విమానయాన సంస్థల వైఖరి వంటి అంశాలను కూడా ఈ ఘటన కొత్త కోణంలో ఆవిష్కరించిందని అభిప్రాయపడుతున్నారు.

Rana : కొత్తపల్లి‌లో ఒకప్పుడు.. రానా కొత్త ప్రయోగం వర్కౌంట్ అయ్యేనా.. !

Exit mobile version