Site icon NTV Telugu

Viral video: రోడ్డు గుట్కా నమిలి ఉమ్మేసిన యువకుడు..అడ్డుకున్న అధికారులు..

మన దేశంలో స్వేచ్ఛగా ఎక్కడ పడితే.. ఉమ్మేస్తారు.. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తారు. ఎవరూ ఎమనరనే భావన చాలా మందిలో ఉంది. కానీ కొందరు నీతులు చెపుతుంటారు. కానీ ఎక్కువ మంది పాటించరు. భారతదేశంలో స్వచ్ఛ భారత్ కింద కోట్లకు కోట్లు ఖర్చు అవుతున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. కారణం జనాలకు సివిక్ సెన్స్ లేకపోవడమే. చెత్త బుట్ట పక్కనే ఉన్నా ఎవడు చూస్తున్నాడులే అని.. విసిరేసి వెళ్లిపోయే వారే మన దేశంలో ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తివివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు స్కూటర్‌పై వెళ్తూ రోడ్డుపైనే గుట్కా ఉమ్మేశాడు. దీన్ని చూసిన మున్సిపాలిటీ సిబ్బంది.. ఫాలో చేసి మరీ అడ్డగించారు. అతనితోనే ఆ ప్లేస్‌ను క్లీన్ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతుండగా.. ఇలాంటి రూల్స్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో తీసుకురావాలని సూచిస్తున్నారు నెటిజన్లు. అప్పుడే దేశం స్వచ్ఛ భారత్‌గా మారుతుందని చెప్తున్నారు.

Exit mobile version