సెల్లార్‌లోనో లేదంటే పార్కింగ్ ప్రదేశంలోనో కారును పార్కింగ్ చేసిన తరువాత లాక్ పడిందా లేదా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. లాక్ పడింది అని రూఢీ చేసుకున్నాకే అక్కడి నుంచి తిరిగి వెళ్తాం. కానీ, ఆ నగరంలో అలా కాదు. కార్లను ఎట్టిపరిస్థితుల్లో కూడా లాక్ చేయరు. 24 గంటలు అన్‌లాక్ చేసే ఉంచుతారు. అలా ఉంచడం వలన కార్లు దోపిడీకి గురయ్యే అవకాశం ఉంటుంది కదా అనుకుంటే పొరపాటే. కార్లను అన్‌లాక్ చేసి ఉంచినా అక్కడ దోపిడీకి గురికావు. అంతేకాదు, కార్లను ఇలా అన్‌లాక్ చేసి ఉంచడానికి కారణం ఉన్నది. ఆ నగరంలో దృవపు ఎలుగుబంట్ల తాకిడి అధికంగా ఉంటుంది. అవి నిత్యం జనావాసాల్లోకి వచ్చి భీభత్సం సృష్టిస్తుంటాయి. మనిషి కనిపిస్తే దాడిచేసి చంపేస్తుంటాయి.
Read: తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
ఎలుగుబంట్లు కనిపించిన సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ నగరంలో కార్లను ఇలా అన్‌లాక్ చేసి ఉంచుతారట. కెనడాలోని చర్చిల్ నగరానికి దృవపు ఎలుగుబంట్ల బెడద అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆహారం కోసమే ఇవి జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇప్పటికే నగరంలోని ఓపెన్ ఎయిర్ డంప్‌ను మూసివేశారు. అయినప్పటికీ అవి జనావాసాల్లోకి వస్తూనే ఉన్నాయి. దీంతో చేసేదిలేక నగరవాసులు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఇలా కార్లను అన్‌లాక్ చేసి ఉంచుతారట. విచిత్రంగా ఉంది కదూ. ఆపద వచ్చినపుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా అవసరం కదా.