NTV Telugu Site icon

Viral News: అక్కడ అబ్బాయి రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..? లేదంటే జైలుకే..!

Polygamy Legal In Eritrea

Polygamy Legal In Eritrea

Polygamy Legal in Eritrea: పెళ్లంటే అమ్మాయిల తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తున్నారు. తన కూతురు కష్టపడకూడదని, అబ్బాయి బాగా సంపాదించాలి. సెట్‌ అయి వుండాలి. ఒక్కడే వుండాలి. ఎలాంటి లొల్లి వుండకూడదు. యూఎస్‌ లో మంచి సాలరీ వుండాలనే ఆలోచన. మనదేశంలో పురుషుల పరిస్థితి అయితే.. నాకు పెళ్లి కావాలి? నాకు పెళ్లికావట్లేదు. పెళ్లి కోసం కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలుకూడా చదివాం. ఇది చాలా మంది అబ్బాయిల పరిస్థితి బాధపడుతుంటారు. వయస్సు అయిపోతోంది. ఇంకా ఎప్పుడు పెళ్లి ? అంటూ అబ్బాయిలకు ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతుంటాయి. మరికొందరు పెళ్లైన వారు ఈపెళ్లి వద్దురా బాబు. సోలో బతుకే సోబెటరు అంటూ వారి పెళ్లి కష్టాలు చెప్పుకుంటూ మాకు ఎంజాయ్‌ లైఫ్‌ పోయింది. కండీషన్‌ లైఫ్‌ వచ్చిందంటూ బాదలు చెప్పుకుంటుంటారు.

పోనీ వేరే పెళ్లి చేసుకోఅంటే ఒక్కదానితోనే వేగలేక పోతున్నా మళ్లీ పెళ్లా నావల్ల కాదు బాబు అంటూ చెబుతుంటారు. అది మాటవరసకే పరిమితం కావాలి. రెండో పెళ్లి చేసుకుంటే మనదేశంలో చట్ట విరుద్దమే. ఒక వేళ రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తిని చట్టపరంగా శిక్షించే అధికారం ఉంది ఇది అందరికీ తెలిసిందే.. అయితే దీనికి విరుద్ధంగా ఓ దేశంలో ప్రతి పురుషుడు ఖచ్చితంగా ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాల్సిందే. చేసుకోను, నాకు ఒకపెళ్లే చాలు.. నేను పోషించలేను. ఒక్కరినే నేను పెళ్లి చేసుకుంటా అంటే మాత్రం అక్కడ అస్సలు కుదరదు. రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. అక్కడ రెండు పెళ్లిళ్లు చేసుకోని పురుషుడిని నేరస్థుడిలా చూస్తారు. అంతేకాదండోయ్‌, అతడికి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు.. సాక్షాత్తు ప్రభుత్వమే చెబుతోంది. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇదే.. నిజం. ఇలాంటి చట్టం ఎక్కడ ఉంది? అని ఆలోచిస్తున్నారా? ఆ విషయం తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళితే..

తూర్పు ఆఫ్రికా దేశం ఎరిత్రియా ప్రభుత్వం వినూత్న చట్టాన్ని అమలు చేస్తోంది. ప్రతి పురుషుడు కచ్చితంగా ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేసింది. లేకుంటే అతడికి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. అంతర్యుద్ధం కారణంగా పురుషుల జనాభా తగ్గింది. దీంతో పురుషుల కంటే అక్కడ స్త్రీల సంఖ్య అధికంగా ఉండటంతో, ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసి, చట్టంగా మార్చింది. దీంతో చట్ట ప్రకారం.. ఒక వేళ ఎవరైనా రెండో పెళ్లి చేసుకోను అంటే.. మాత్రం అతడిని అందరూ నేరస్థుడిలా చూస్తారు. అంతేకాదు.. సదరు వ్యక్తికి జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంది. ఎరిత్రియా దేశంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగడానికి.. అక్కడి ప్రభుత్వం ఈ పద్ధతిని చట్టంగా మార్చి అమలు చేయడానికి పెద్ద కారణమే ఉంది. ఆ దేశంలోని స్త్రీల సంఖ్యే దీనికి కారణం. పురుషుల కంటే.. అక్కడ స్త్రీల సంఖ్య అధికంగా ఉంది. దీంతో ప్రభుత్వం ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ఆమోదముద్ర వేసింది. మొత్తానికి ఎరిత్రియ దేశంలో ఉన్న చట్టంతో మగాళ్లు జత పెళ్లిళ్లు చేసుకోవడం ఓ ప్రహసనంగా మారింది.
Indian 2: కమల్ అభిమానులకు శుభవార్త.. భారతీయుడు-2 మూవీని మళ్లీ మొదలుపెట్టేశారు

Show comments