NTV Telugu Site icon

Elections 2024:పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఓటు వేసిన వధూవరులు.. వీడియో వైరల్..

12

12

నేడు భారతదేశంలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ నిబంధనలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అన్ని రకాల వర్గాల ప్రజలు ఓటు వేయడానికి ఉదయం నుంచి పోలింగ్ బూతుల బయట లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 18 ఏళ్ల పై బడిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకుని వారి ప్రజా నాయకుడిని ఎన్నుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఎన్నికల నిబంధనలో నేడు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్‌లో బిజెపి, టిఎంసి పరస్పర దాడులు

జమ్మూ మరియు కాశ్మీర్ లోని కథువా ప్రాంతంలో మొత్తం పెళ్లి ఊరేగింపు తోపాటు ఓటు వేయడానికి పోలింగ్ బూతు వద్దకి వధూవరులు వచ్చారు. ఉదంపూర్ నగరంలో పెళ్లి చేసుకున్న ఆ జంట వెంటనే వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి కుమారుడు తన భార్యతో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కి వెళ్ళాడు.

Also Read: Lok Sabha Elections: చరిత్రలో తొలిసారి.. అతి తక్కువ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..

వారిద్దరు ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన ప్రాంతం, అలాగే దేశం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఓటు వేయాలంటూ వధువు కోరింది.