ఈ దీపావళిని అందరూ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చక్కగా ముస్తాబై, రంగురంగుల బట్టలు ధరించి ఇంటిముందు పటాకులను పేల్చి ఉంటారు. ఇంకేముంది.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే. దీపావళి రోజు అందరూ టపాకాయలు పేల్చుతూ ఎంజాయ్ చేసిన వీడియోలు పోస్ట్ చేస్తే, ఓ మహిళ వెరైటీగా.. జడలో పువ్వులకు బదులుగా టపాకాయలు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
Read Also: World Cup 2023 Final: ప్రపంచకప్ ఫైనల్‌లో భారత ఓటమిని తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
ఈ వీడియోలో ఓ మహిళ అందమైన చీర కట్టుకుని ఉంది. ఓ కూర్చీలో కూర్చొని ఉన్న ఆమె.. తన జుట్టులో క్రాకర్స్ ఉన్నట్లు కనపడుతున్నాయి. అంతేకాకుండా.. ఆమె జుట్టుకు మొదట్లో రాకెట్లు, కొప్పుకు బాంబుల దండ, ఉల్లిగడ్డ బాంబులు చుట్టినట్లు కనిపిస్తుంది. ఇక.. జడ పొడుగున భూచక్రాలు అమర్చారు.
Read Also: Viral Video: టాయిలెట్ గదిలో దెయ్యం వేషంలో ఓ వ్యక్తి.. వీడియో చూస్తే షాక్..!
ఈ లేటెస్ట్ హెయిర్ స్టైల్ కు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కొత్తరకం ఫ్యాషన్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ బాణాసంచాను అగ్గిపుల్లతో వెలిగించాలని నేను అనుకున్నాను అని ఒక వ్యక్తి కామెంట్‌లో రాశాడు. ఇప్పుడే కాల్చండి అని మరొకరు రాశారు. ఎవరైనా నిజంగా నిప్పు పెడితే ఏమవుతుంది? అని కామెంట్ చేశారు. ఈ వీడియో @kamal_hairstylist_official ఐడీతో ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.