రోజురోజుకు వివాహేతర సంబంధాలు మరి దిగజారిపోతున్నాయి. ఎవరు ఎవరితో ఎఫైర్ పెట్టుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి.. వావి వరసలు లేకుండా కొందరు రెచ్చిపోతున్నారు. భర్త, పిల్లలు ఉన్నా మహిళలు పరాయి పురుషుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.. భర్తలు ఇంటిల్లీపాదిని వదిలేసి మరో మహిళతో ఎఫైర్ పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొందరు భార్యలు ఎకంగా భర్తలు అడ్డుగా ఉన్నారని.. వాళ్లని చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. అయితే ఓ భర్త తన భార్యను వెళ్లిన వ్యక్తి భార్యను తీసుకెళ్లి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Romancing in Lift: ఏందిరా ఇది.. అది లిప్ట్ అనుకున్నారా.. ఓయో రూమ్ అనుకున్నారా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని ఖగారియా జిల్లాలో నీరజ్‌కు 2009లో రూబీదేవితో వివాహం జరిగింది. వీరీకి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే రూబీదేవికి ముఖేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. రూబీ దేవీ.. భర్త పిల్లలను వదిలేసి 2022 ఫిబ్రవరిలో ముఖేష్‌తో వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిద్దరు వేరు కాపురం పెట్టేశారు. ఈ సంఘటనతో షాక్ తిన్న నీరజ్.. తన భార్యను ముఖేష్ కిడ్నాప్ చేశాడని ఖగారియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఈ జంట పోలీసులకు దొరక్కుండా.. రహస్యంగా సహజీవనం చేస్తున్నారు.
Read Also:Onion and Garlic: భారత్ లో పూర్తిగా ఉల్లి, వెల్లుల్లిని నిషేదించిన ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా..
అయితే నీరజ్ న్యాయం కోసం గ్రామ పెద్దలను ఆశ్రయించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అయితే ముఖేష్ కు రూబీ అనే మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకున్న నీరజ్.. ఆమె దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. మనమిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి ఆమెను ఒప్పించాడు. అయితే అందుకు ఆమెకు అంగీకరించడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుని.. లేచిపోయిన జంటకు గుణపాఠం నేర్పారు. కరెక్టుగా ఏడాది తర్వాత తన భార్యను లేపుకెళ్లిన వ్యక్తి భార్యను పెళ్లి చేసుకోని ‘భార్యకు భార్య చెల్లు’ అన్న విధంగా నీరజ్ ప్రతీకారం తీర్చుకోవడం సంచలనం సృష్టించింది. అయితే ఈ సంఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం.
