NTV Telugu Site icon

Viral Video: ఏఐ సాంకేతికతతో 60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్.. వీడియో వైరల్

Viral Video

Viral Video

అస్సాంలో ఓ లోకో పైలట్ తన తెలివి తేటలతో పెను ప్రమాదాన్ని కాపాడారు. వాస్తవానికి.. రైలు నంబర్ 15959 కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ గౌహతి నుంచి లుమ్‌డింగ్‌కు వెళ్తోంది. రాత్రి 8:30 గంటల సమయంలో.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ అకస్మాత్తుగా 60 కంటే ఎక్కువ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ గుండా వెళుతున్నట్లు చూశారు. ఏనుగుల గుంపును చూసిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్ విజ్ఞత చూపకపోతే చాలా ఏనుగులు చనిపోయి రైలు కూడా ఢీకొనే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏనుగులన్నీ మెల్లగా రైల్వే ట్రాక్ దాటుతున్న దృష్యాన్ని వీడియోలో చూడొచ్చు.

READ MORE: Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు

ఏనుగులు వెళ్లిపోయిన తర్వాత, కొంతమంది ముందుకెళ్లి ఏనుగులన్నీ వెళ్లాయా లేదా అని తనిఖీ చేశారు. అప్పుడు రైలు బయలుదేరుతుంది. చాలా ఏనుగులు ట్రాక్‌పై ప్రయాణిస్తున్నాయని లోకో పైలట్ అధికారులకు చెప్పారు. చిమ్మ చీకటిలో వేగంగా వెళ్తున్న రైలులో నుంచి లోకో పైలట్లు ఏనుగులను గమనించడానికి కారణం ఏఐ బేస్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఈ సేఫ్టీ సిస్టమ్ ముందుగా అలెర్ట్ ఇవ్వడంతో లోకో పైలట్లు రైలు వేగాన్ని తగ్గించారు. ఆ తర్వాత ఏనుగులను చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమైంది. దీనికి ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన తర్వాత చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్‌లను ప్రశంసించారు. అంతేకాకుండా ఏఐ ఆధారిత సాంకేతికతను కూడా వినియోగదారులు ప్రశంసించారు.