NTV Telugu Site icon

Groom Chasing: ఓ దొంగకు తిక్క కుదిర్చిన వరుడు.. సినిమాను తలపించిన ఛేజింగ్

Groomchasing

Groomchasing

నిదానమే ప్రదానం అన్నారు పెద్దలు. ఎవడి దారిన వాడు పోతే ఇబ్బంది ఉండదు. అంతేకానీ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే.. ఎవడికైనా తిక్క రేగుతుంది. ఈ స్టోరీ చదివితే.. లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. అసలేం జరిగింది. ఊరేగింపులో ఉన్న పెళ్లికొడుకు ఒక్కసారిగా ఉగ్రరూపం ఎందుకు దాల్చాడు. సినీ ఫక్కీలో ఛేజింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Allu Arjun : పుష్ప – 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది.. ఎక్కడంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ ప్రాంతం. ఓ యువకుడు పెళ్లికుమారుడిగా ముస్తాబైయ్యాడు. స్నేహితులు, బంధువుల రాకతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నారు. ఇక పెళ్లి సంప్రదాయంలో భాగంగా వరుడిని గుర్రంపై ఊరేగించే సమయం వచ్చింది. యువకుడు పెళ్లికొడుకుగా తయారై.. గుర్రంపై ఊరేగింపుగా బయల్దేరాడు. మెడలో నోట్లతో కూడిన దండ వేసుకుని సాగిపోతున్నాడు. పెళ్లికొచ్చిన వారందరితో సంతోషంగా రోడ్డుపై ఊరేగింపు జరుగుతోంది. ఇంతలో ఓ మినీ ట్రక్కు అటుగా వచ్చింది. అంతే అందులో ఉన్న డ్రైవర్.. పెళ్లికొడుకు మెడలో ఉన్న డబ్బుల దండను లాక్కుని వేగంగా పారిపోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా వరుడికి తిక్క రేగింది. వెంటనే గుర్రం పైనుంచి దిగి అక్కడే ఉన్న బైక్ తీసుకుని స్నేహితులతో వెంబడించాడు. వరుడు ట్రక్కు పైకి దూకి డ్రైవర్‌ను అడ్డుకున్నాడు. అనంతరం ట్రక్కు డ్రైవర్‌ను కిందకి దింపి బడిత పూజ చేశారు. వరుడితో సహా స్నేహితులంతా చితకబాదారు. అయితే ఛేజింగ్ అంతా ఒక సినిమా తరహాలో జరగడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

 

Show comments