Site icon NTV Telugu

Foot Baller : శృంగారం కోసం సాక్స్ లో కండోమ్..

Condom

Condom

అసలు ఆ ఆటగాడు వేసిన స్కెచ్ మాములుగా లేదు.. శృంగారం చేసేందుకు.. తన సాక్స్ లో కండోమ్ ను దాచి పెట్టాడు. కట్ చేస్తే.. మ్యాచ్ హాఫ్ టైం ముగిసిన వెంటనే పని చేసుకొని వచ్చాడు. ఇంతకీ అతను ఎవరో కాదు.. ఇజ్రాయిల్ కు చెందిన ప్రముఖ పుట్ బాల్ ప్లేయర్ ఫెలిక్స్ హల్ఫోన్. మ్యాచ్ కు కొద్ది సేపటి ముందు శృంగారంలో పాల్గొనే ఆటగాళ్ల స్టోరీలు మనం చాలానే చూసి ఉంటాం.. 1970లో లెజెండరీ పుట్ బాల్ ప్లేయర్ జార్జ్ బెస్ట్ ఇదే విధంగా చేసి.. ఆ సమయంలో సంచలనం సృష్టించాడు.

Read Also : Today Stock Market Roundup 27-04-23: ‘‘హమారా బజాజ్..’’ అన్న ఇన్వెస్టర్లు

అయితే 1993లో ఇజ్రాయల్, స్వీడన్ మధ్య ఓ పుట్ బాల్ మ్యాచ్ జరుగింది. ఇందులో ఇజ్రాయిల్ ఆటగాళ్లందరూ మ్యాచ్ ఫలితంపై నజర్ పెడితే.. ఫెలిక్స్ హల్ఫోన్ మాత్రం మరో దానిపై దృష్టి పెట్టాడు. తన మేనేజర్ మాటలను సైతం పక్కనపెట్టి.. మ్యాచ్ హాఫ్ టైం ముగిసిన వెంటనే ఓ స్వీడిష్ యువతితో శృంగారంలో పాల్గొన్నాడు.

Read Also : Yasangi : యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం

దీంతో ఆ విషయం అప్పుడే బయటకు రావడంతో.. ఆ తర్వాత ఫెలిక్స్ హల్ఫోన్ ఇది పెద్ద విషయమేమి కాదు.. నేను ఎప్పుడూ నా సాక్స్ లో ఒక కండోమ్ ని ఉంచుకుంటాను అని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇజ్రాయిల్ టీమ్ 5-0తో స్వీడన్ పై గెలిచింది. మాజీ ఇజ్రాయిల్ ఎఫ్ఏ ప్రతినిధి షాల్ ఐసెన్ బర్గ్ రాసిన పుస్తకంలో ఈ విషయం వెల్లడైంది. పుట్ బాల్ లో ఇలాంటివి కూడా జరుగుతున్నాయని అతడు తన పుస్తకంలో ప్రచురించడంతో.. షాల్ పై విమర్శల పర్వం వెల్లువెత్తాయి.

Read Also : Infosys: ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి.. రైతుగా లక్షల్లో సంపాదిస్తున్న టెక్కీ..

కాగా.. ఫెలిక్స్ హల్ఫోన్ ఇజ్రాయిల్ తరపున 38 మ్యాచ్ లు ఆడాడు. తన కెరీర్ లో ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకున్నాడు. ఇక ఆగస్ట్ 2003లో.. అతడె టోల్ అవీవ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో కొకైన్ ను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అనంతరం నాలుగున్నర సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడి తెలుస్తుంది.

Exit mobile version