NTV Telugu Site icon

Beach Riding: బీచ్‌లో కూరుకుపోయిన కారు.. ఎడ్లబండి సాయంతో ఒడ్డుకు.. వీడియో వైరల్

Mumbai

Mumbai

బీచ్‌ అంటేనే ఆహ్లాదం.. ఉల్లాసం.. సంతోషం.. పైగా న్యూఇయర్ సమయం. పాత ఏడాదికి గుడ్‌బై చెప్పి.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న సమయం. అయితే ఇద్దరు ముంబై టూరిస్టులు ఉదయం బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఖరీదైన కారుతో బీచ్‌లో రైడింగ్ చేస్తున్నారు. అంతే ఉన్నట్టుండి ఇసుకలో కారు కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. ఇక చేసేదేమీ లేక ఎడ్లబండి సాయంతో బయటకు తీశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ బీచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: BJP: బీజేపీ అధికారం వస్తే మమతా బెనర్జీకి జైలు..

ముంబైకి చెందిన ఇద్దరు యువకులు.. ఫెరారీ కారులో రాయ్‌గఢ్ జిల్లాలోని రేవ్‌దండా బీచ్‌కు వెళ్లారు. సముద్రపు అలలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో కారు ఇసుకలో కూరుకుపోయింది. దీంతో అక్కడున్నవారంతా వచ్చి వాహనాన్ని బయటకు లాగే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఎడ్లబండి కంటపడటంతో సాయం కోరారు. ఫెరారీ కారు ముందుభాగాన్ని తాడుతో కట్టి ఎడ్లబండిని ముందుకు పోనిచ్చారు. ఇలా లగ్జరీ కారు ఎట్టకేలకు బయటపడింది.

Show comments