NTV Telugu Site icon

Arunachal Pradesh: వేదికపైనే కోడిని చంపి రక్తం తాగిన ప్రముఖ సింగర్(వీడియో)

Kon Waii Son

Kon Waii Son

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు కాన్ వాయ్ సన్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో తన కచేరీలో.. అతడు వేదికపై బహిరంగంగా కోడిని కత్తితో చంపేసి ఆపై దాని రక్తాన్ని పిండుకుని తాగాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేశారు. సంగీతకారుడు కాన్ వాయ్ సన్‌ అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని సెప్పా నివాసి. అతని పాటల కారణంగా రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందాడు. స్వయంగా పాటలు రాసి, పాడటం, దానికి సంగీతం చేర్చడంతో అత్యధిక అభిమానులకు కూడగట్టుకున్నాడు.

READ MORE: Chennai: ముంబై బాలికపై ఆటోడ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు అత్యాచారం.. నిందితుల్లో ఏపీ వాసి

అయితే.. తాజాగా అక్టోబర్ 27న, తన లైవ్ స్టేజ్ షోలో సన్ స్టేజ్‌పై కోడి గొంతు కోసి,రక్తం తాగడం ప్రారంభించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా జంతువుల కోసం పనిచేస్తున్న పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా), ఇండియా అనే జంతు సంరక్షణ సంస్థ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇండియన్ జస్టిస్ కోడ్, జంతువులపై క్రూరత్వం నిరోధం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై గాయకుడు క్షమాపణలు చెప్పాడు. వేదికపై అలా జరిగి ఉండకూడదని.. ఎవరైనా గాయపడే అవకాశం ఉండేద అన్నాడు. అందుకే క్షమాపణలు చెప్పాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జంతు దుర్వినియోగం తీవ్ర మానసిక క్షోభను సూచిస్తుంది. జంతువుల రక్షణ కోసం పనిచేస్తున్న పెటా అనే సంస్థ గతంలో భారత ప్రభుత్వానికి లిఖితపూర్వక ప్రతిపాదనను కూడా పంపింది. ఈ ప్రతిపాదనలో జంతువుల పట్ల క్రూరత్వానికి శిక్షను పెంచాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

READ MORE:Minister Anitha: సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా.. హోంమంత్రి సీరియస్