Site icon NTV Telugu

Elephant: ఏనుగును ర‌క్షించిన అర్కిమెడీస్ సూత్రం…

ఫిజిక్స్ గురించి తెలిసిన వాళ్ల‌కు ఆర్కిమెడిస్ సూత్రం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుంటుంది. ఈ సూత్రాన్ని అప్లై చేసి గుంత‌లో ప‌డిపోయిన ఏనుగును బ‌య‌ట‌కు తీశారు అట‌వీశాఖ అధికారులు. ప‌శ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో అట‌వీప్రాంతంలో ఓ ఏనుగు గుంత‌లో ప‌డిపోయింది. లోతు ఎక్కువ‌గా ఉండ‌టంతో తొండం స‌హాయంతో పైకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేసింది. కానీ, లాభం లేక‌పోయింది. అయితే, విష‌యం తెలుసుకున్న అట‌వీశాఖాధికారులు ఆ ఏనుగును బ‌య‌ట‌కు తీసుకొచ్చుందుకు ఆర్కిమెడీస్ ప్ర‌తిపాదించిన సూత్రాన్ని అప్లై చేశారు.

Read: Ukraine Crisis: ర‌ష్యాతో ఉక్రెయిన్ బ్రేక‌ప్‌… నిలిచిపోయిన నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌…

ఆ గుంతలోకి పైపుల ద్వారా నీటిని పంపారు. నీరు పెరిగేకొల‌ది ఆ ఏనుగు అందులో ఈత కొట్ట‌డం ప్రారంభించింది. ఆ నీటితో పాటు ఏనుగు కూడా పైకి వ‌చ్చింది. పై వ‌ర‌కు వ‌చ్చిన ఏనుగును సిబ్బంది తాళ్ల‌తో పైకి లాగారు. దీనికి సంబంధించిన వీడియోను ఫారెస్ట్ అధికారులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతున్న‌ది.

Exit mobile version