NTV Telugu Site icon

Bengal: తాగిన మత్తులో అందరూ చూస్తుండగానే.. మహిళ పెదాలపై ముద్దు పెట్టిన పోలీస్(వీడియో)

Viral News

Viral News

పోలీసులు తాగిన అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే మద్యం మత్తులో మహిళా పోలీసు స్పృహ కోల్పోయిన వీడియో బహుశా మొదటిసారిగా బయటపడింది. ఓ మహిళా పోలీసు మత్తులో మరో మహిళను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌కు చెందినది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఓ మహిళా పోలీసు పెట్రోలింగ్‌లో ఉన్నారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఈ మహిళా పోలీసు అధికారి పేరు తాన్యా రాయ్. మహిళా అధికారి మద్యం మత్తులో ఉన్నారని సమీపంలోని వ్యక్తులు ఆరోపించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతలో మహిళా పోలీసు అధికారిణి తాన్యా రాయ్ తన పక్కనే ఉన్న మహిళ పెదాలపై ముద్దు పెట్టింది.

READ MORE: AP Govt: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ పథకానికి సబ్సిడీ నిధులు విడుదల

స్థానికుల కథనం ప్రకారం.. ఈ ఘటన అక్టోబర్ 23 బుధవారం జరిగింది. స్థానికంగా ఉన్న పోలీసు అధికారి తానియా రాయ్ తన సిబ్బందితో కలిసి డ్యూటీలో ఉంది. అయితే.. అక్కడ నుంచి కొంతమంది మహిళలు వెళ్తున్నారు. పోలీసు అధికారిణి తాగి ఉంది. దీంతో అటునుంచి వెళ్తున్న కొందరు ఆమె వద్దకు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తాగి ఉండటంతో సదరు మహిళ ప్రశ్నించింది. అప్పుడు ఆ లేడీ పోలీసు మహిళను నేను తాగానో లేదో చెక్‌ చేసుకో అంటూ.. ఆమెకు ముద్దు ఇవ్వబోయింది. అంతేకాకుండా.. ఆమెకు ముద్దుపెట్టేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురవుతున్నారు. పోలీసు వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోపై బీజేపీ నేత సమిక్ భట్టా చార్య ఎక్స్ వేదికగా మండిపడ్డారు. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.