Site icon NTV Telugu

Mumbai : ముంబయి లోకల్ ట్రైన్‌లో డెయిలీ ప్రయాణిస్తున్న కుక్క

Dog

Dog

ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు జీవితాంతం ఎంతో విశ్వాసంగా ఉండే జంతువు కుక్కు.. అది చూపించే ప్రేమను మరెవ్వరు కూడా చూపించారు. ఎందుకంటే విశ్వాసానికి మరో పేరే డాగ్.. అలాంటి కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైనల్ గా మారింది. ముంబయి లోకల్ ట్రైన్ రోజూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. అయితే డెయిలీ ఓ డాగ్ కూడా ఇక్కడి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తుంది.

Also Read : IPL 2023 : బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న ఆర్సీబీ.. 10 ఓవర్లకు స్కోర్..?

అవును.. నిజమే. ఇప్పుడు ఈ డాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ముంబయి లోకల్ ట్రైన్‌లో నిత్యం ఎంతోమంది ప్రయాణిస్తుంటారు. రోజు వారి పనుల మీద వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి వీటి మీదే ఆధారపడతారు. అయితే ఓ కుక్క కూడా ప్రతిరోజు లోకల్ ట్రైన్ ఎక్కుతోంది. బోరివాలి నుంచి అంధేరి స్టేషన్ వరకు అది ప్రయాణం చేస్తుందని తెలుస్తోంది. ఇక ఈ డాగ్ ట్రైన్ ఎక్కాక ఎవరినీ ఇబ్బంది పెట్టదట. ప్రశాంతంగా రైళ్లో కూర్చోవడం లేదా పడుకోవడం.. ట్రైన్ తలుపు దగ్గర తన జర్నీని ఆస్వాదిస్తూ నిలబడటం చేస్తుండం మనం ఈ వీడియో చూడొచ్చు..

Also Read : Pawan Kalyan: మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి.. ఎమోషనల్ అయిన మెగా బ్రదర్స్

indiaculturalhub అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ ఈ వీడియోని నెట్టింట షేర్ చేశారు. ‘రెగ్యులర్ ట్రావెలర్ ని కలవండి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల మనసును గెలుచుకుంది.. నేను ఖచ్చితంగా ఈ కుక్కను ఆ ప్రాంతానికి వెళ్లి కలవాలనుకుంటున్నాను’ అని యూజర్ కామెంట్ చేయగా.. నేను దానిని చూసాను. రాత్రికి అంథేరికి వస్తాడు అని మరొకరు కామెంట్లు పెట్టారు. ఈ కుక్క ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తోందో? లేక ఈ రూట్లో ఏం పనో? అని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version