Site icon NTV Telugu

Dinosaur Eggs: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బ‌య‌ట‌ప‌డిన డైనోసార్ గుడ్లు… ఒక్కొక్క‌టీ…

భూమిమీత అతిపెద్ద జీవులుగా గుర్తించ‌బ‌డిన రాక్ష‌స‌బ‌ల్లులు కొన్ని ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల క్రితం అంత‌రించిపోయాయి. అయితే, వాటికి సంబంధించిన ఆన‌వాళ్లు, వాటి శిలాజాలు, గుడ్లు అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతుంటాయి. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాక్ష‌స‌బ‌ల్లుల గుడ్లు కొన్ని బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బ‌డ‌వాన్ అడవిలో 10 గుడ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ గుడ్ల వ‌య‌స్సు సుమారు కోటి సంవ‌త్స‌రాల‌కు పైగా ఉంటుంద‌ని పురాతత్వ శాస్త్ర‌వేత్తలు చెబుతున్నారు. పురాత‌త్వ శాస్త్ర‌వేత్తలు పురాత‌న శిల్పాలు, కోట‌లు త‌దిత‌ర వాటిపై స‌ర్వేలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో సెంధ్వా జిల్లాలోని హింగ్వా గ్రామ స‌మీపంలోని అడ‌విలో 10 గుడ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ 10 గుడ్ల‌లో ఒక‌టి 40 కిలోల వ‌ర‌కు బ‌రువు ఉండ‌గా, మిగ‌తావి 25 కిలోల వ‌ర‌కు బ‌రువు ఉన్నాయి. ఈ డైనోసార్ రాతి గుడ్ల‌ను ఇండోర్ లోని మ్యూజియంకు త‌ర‌లించారు.

Read: Ukraine Crisis: ర‌ష్యా జ‌లాల్లోకి అమెరికా జ‌లాంత‌ర్గామి… ప‌రిస్థితులు ఉద్రిక్తం…

Exit mobile version