కరోనా మహమ్మారి రాక మునుపు ప్రతి ఒక్కరి జీవితాలు సంతోషంగా ఉన్నాయి. ఉన్నదాంట్లో తింటూ, వచ్చిన పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. కరోనా మహమ్మారి వచ్చి ఒక్కసారిగా మొత్తం తలక్రిందులు చేసింది. కరోనా కాలంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ప్రైవేటు టీచర్ల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఉద్యోగాలు కోల్పోవడంతో రోడ్డున పడ్డారు. దీంతో ఉపాధికోసం వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
Read: Viral: కొండల మధ్య 19 ఏళ్ల కుర్రోడు… ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్…
ఢిల్లీలో ఓ ప్రముఖ స్కూళ్లో టీచర్‌గా పనిచేస్తున్న సుమన్ అనే మహిళ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగం కోల్పోవడంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, వంట చేయడం హాబీగా ఉన్న టీచర్ దానినే జీవనోపాధిగా మార్చుకుంది. పెద్ద ఎత్తున భోజనం తయారు చేసి రోడ్డుపక్కన స్టాల్‌ను ఏర్పాటు చేసుకొని విక్రయించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం తన కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేవని సుమన్ తెలియజేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
