Site icon NTV Telugu

న‌యా ఐడియా: ప్ర‌భుత్వానికి కాకుల సాయం… దానికోసం భారీగా త‌గ్గిన ఖ‌ర్చు…

యూర‌ప్‌లోని చాలా దేశాలు ప‌చ్చ‌ద‌నానికి ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌త ఇస్తాయి. ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌త ఇచ్చే దేశాల్లో స్వీడ‌న్ కూడా ఒక‌టి. స్వీడ‌న్‌లో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ధూమ‌పానంపై నిషేధం లేదు. ఆ దేశంలోని ప్ర‌జ‌లు సిగ‌రేట్ కాల్చి వాటి పీక‌ల‌ను రోడ్డుపై ప‌డేస్తుంటారు. వీటిని శుభ్రం చేయ‌డం కోసం అక్క‌డి ప్ర‌భుత్వం భారీగా నిధుల‌ను ఖ‌ర్చుచేయాల్సి వ‌స్తున్న‌ది. సిగ‌రేట్ పీల‌క‌ను ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ వేయ‌వ‌ద్ద‌ని చెప్పినా ప్రజ‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అక్క‌డి అధికారులు వినూత్నంగా ఆలోచించారు. న‌గ‌రంలోని కోర్విన్ క్లీనింగ్ అనే స్టార్ట‌ప్ కంపెనీని సంప్ర‌దించారు అధికారులు. స్టార్ట‌ప్ కంపెనీ వినూత్నంగా రంగంలోకి దిగింది. కోర్విడ్ జాతికి చెందిన న్యూ కెలడోనియా కాకులు చాలా తెలివైన‌వి.

Read: దేశంలో ఈ రెస్టారెంట్లు య‌మా ఫేమ‌స్‌… వందేళ్లైనా ఇంకా…

మ‌నుషుల‌కు మాదిరిగానే ఆలోచిస్తాయి. ప‌నులు చేస్తాయి. దీంతో వీటికి అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. రోడ్డుపై క‌నిపించిన సిగ‌రేట్ పీక‌ల‌ను అక్క‌డ ఏర్పాటు చేసిన డ‌బ్బాలో వేస్తే దానికి బ‌దులుగా అందులో నుంచి వాటికి కావాల్సిన ఆహారం వ‌స్తుంది. దీంతో కాకులు రోడ్డుపై ప‌డిన సిగ‌రేట్ పీక‌ల‌ను ఏరి డబ్బాలో వేయ‌డం మొద‌లుపెట్టాయి. స్వీడ‌న్ ప్ర‌భుత్వం రోడ్ల‌పై ప‌డిన పీక‌ల‌ను ఏరివేయ‌డానికి ఖ‌ర్చు చేస్తున్న దానిలో 20 వంతు ఖ‌ర్చుతో కాకుల‌తో క్లీనింగ్ చేయిస్తున్నారు.

Exit mobile version