Pre Wedding Shoot: ముదురుతున్న పిచ్చి.. ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్ కోసం ఓ జంట ఎంత పని చేసిందంటే..!
- వెర్రితలలు వేస్తున్న ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్‌లు
- సినిమా రేంజ్లో రెచ్చిపోయిన జంట
- సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు పెళ్లంటే ‘‘కట్టె.. కొట్టె.. తెచ్చె’’ అన్న రీతిలో జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాల ప్రభావమో.. లేదంటే సోషల్ మీడియా ప్రభావమో తెలియదు గానీ ప్రస్తుత పెళ్లిళ్లు వెర్రితలలు వేస్తున్నాయి. పెళ్లికి ముందే రకరకాలైన కార్యక్రమాలు వచ్చేశాయి. ప్రతీ కార్యక్రమాన్ని ఓ రేంజ్లో నిర్వహిస్తున్నారు. ఇందు కోసం లక్షలు.. కోట్లు ధారపోస్తున్నారు.
ఒకప్పుడు పెళ్లైంత వరకు అమ్మాయి-అబ్బాయిలు చూసుకోవడానికి గానీ.. మాట్లాడుకోవడానికి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లికి ముందే ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్‌లు.. మెహందీ, సంగీత్ కార్యక్రమాలు అంటూ రకరకాలైన ప్రోగ్రామ్స్ వచ్చేశాయి. అయితే ఏదైనా హద్దుల్లో చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఫ్రీ-వెడ్డింగ్ పేరుతో జంటలు శృతిమించుతున్నాయి. తాజాగా ఒక జంట చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పాలైంది.
Also Read
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
- Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
- Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
ప్రీ-వెడ్డింగ్ పేరుతో ఓ జంట హద్దులు దాటింది. సినిమా రేంజ్లో సీన్లు ఉండాలనుకున్నారో.. లేదంటే క్రియేటివిటీగా ఉండాలనుకున్నారో తెలియదు గానీ.. బురద నీటిలో ఫొటోషూట్‌కు దిగారు. అమ్మాయి-అబ్బాయి ఇద్దరూ బురద నీటిలో పడుకోగా.. ఫొటోగ్రఫీ టీమ్ మోకాళ్ల లోతు బురద నీటిలో నిలబడి ప్రొఫెషనల్‌గా భంగిమలు చూపిస్తూ షూట్ చేశారు. అయితే ఈ ఫొటోషూట్ ఎక్కడ చేశారో తెలియదు గానీ సోషల్ మీడియాలో నవ్వుల పాలైంది. నెటిజన్లు రకరకాలైన కామెంట్లు వస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
ఏఐ కాలంలో కూడా ఇంకా ఇలాంటి ఫొటోషూట్లా? ఏఐ ద్వారా రకరకాలైన మోడళ్లలో తీసుకోవచ్చు కదా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ప్రీ-షూట్ల కోసం రిస్క్ తీసుకుని డబ్బు ఎందుకు వృధా చేస్తారు? మీ ఫొటోలను మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేయమని ఏఐని అడగండి..’’ అని మరొకరు రాశారు. ‘‘వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారా? లేదంటే క్రైమ్ సీన్ చిత్రకరిస్తున్నారా? అంటూ మరొకరు రాసుకొచ్చారు.
Pre Wedding Shoots are getting too weird 😂😂 pic.twitter.com/xhVKjoZrVy
— Rosy (@rose_k01) March 18, 2026
తాజావార్తలు
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్‌కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..