NTV Telugu Site icon

ఆ దేశంలో విచిత్ర‌మైన శిక్ష‌ణ‌: సైనికులుగా మారాలంటే…

సాధార‌ణంగా సైనికుల‌కు ఇచ్చే శిక్ష‌ణ ఏ దేశంలో చూసుకున్నా క‌ఠినంగా ఉంటుంది. శిక్ష‌ణ‌కోసం పెద్ద ఎత్తున అక్క‌డి ప్ర‌భుత్వాలు ఖ‌ర్చు చేస్తుంటాయి. ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైనా తట్టుకునేలా శిక్ష‌ణ ఇస్తాయి. అయితే, థాయ్‌లాండ్ దేశంలో సైనికుల‌ను ఇచ్చే శిక్ష‌ణ చాలా దారుణంగా ఉంటుంది. అడ‌వుల్లో తిరిగే పురుగుల‌ను, జంతువుల‌ను, పాముల‌ను చంపి తినేలా ట్రైనింగ్ ఇస్తారు. వియాత్నం, మ‌లేషియా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా దేశాల్లో అడవులు అధికంగా ఉంటాయి. అంతేకాదు, అక్క‌డ ప్ర‌మాద‌క‌ర‌మైన విష జంతువులు అధికంగా నివ‌శిస్తుంటాయి. ప‌హార స‌మ‌యంలో ఏదైనా అనుకోని విధంగా విప‌త్తు సంభ‌వించి సైనికులు అడవిలో త‌ప్పిపోతే అక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు పాముల‌ను, పురుగుల‌ను, ఇత‌ర జంతువుల‌ను ప‌ట్టుకొని చంపి తినే విధంగా ట్రైనింగ్ ఇస్తారు.

Read: న‌యా ఐడియా: ప్ర‌భుత్వానికి కాకుల సాయం… దానికోసం భారీగా త‌గ్గిన ఖ‌ర్చు…

ఈ ట్రైనింగ్ చాలా క‌ఠినంగా ఉంటుంది. విష‌పూరిత‌మైన పాముల‌ను ప‌ట్టుకోవ‌డం, వాటిని చంపిన త‌రువాత విషాన్ని వేరుచేయ‌డం, వాటి ర‌క్తాన్ని తాగ‌డం వంటివి శిక్ష‌ణ‌లో భాగంగా ఇస్తారు. 1982నుంచి థాయ్‌లాండ్ ప్ర‌భుత్వం అమెరికాతో క‌లిసి ట్రైనింగ్ ఇవ్వ‌డం మొద‌లుపెట్టిది. దీనికి కోబ్రా గోల్డ్‌ మిలిట‌రీ డ్రిల్ అనే పేరు పెట్టింది. సుమారు 27 దేశాల‌కు చెందిన సైనికులు థాయ్‌లాండ్‌లో ఈ మిల‌ట‌రీ డ్రిల్‌లో ట్రైనింగ్ తీసుకుంటుంటారు.