NTV Telugu Site icon

Drunk UP man: మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది.. తాగుబోతుని కాటేసి చనిపోయిన కింగ్‌ కోబ్రా

Drunk Up Man1

Drunk Up Man1

Drunk UP man: మందు వేస్తే చిందే మందు ముందు ఏదైనా తల వంచాల్సిందే.. తాగిన మత్తులో మందుబాబులు హల్‌ చల్‌ చేస్తే మామూలుగా వుండదు మరి. ఆమత్తులో వాళ్లు చేసే వీరంగం అంతాఇంతా కాదు. మత్తులో వున్న వారికి పట్టుకున్నామో ఇక అంతే సంగతులు. వారి మాటలు వారు చేసే చేస్టలు మమూలుగా వుండదు మరి. తాగుబోతులంటే చులకన చూసే వారికి ఈ వింత ఘటన గురించి వింటే షాక్‌ ఉండిపోతారు. ఓ మనిషిని పాము కాటేస్తే అక్కడికక్కడే నోట్లో నుంచి నురుగలు కక్కుతూ చనిపోతాడు. కానీ ఇక్కడ రివర్స్‌ తాగుబోతుకు కాటేసిన పాము అదే చనిపోయింది. ఓ తాగుబోతు చనిపోయిన కింగ్ కోబ్రాతో ఆసుపత్రికి వెళ్లి వీరంగం సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌ లోని ఖురీనగర్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

పద్రౌనా నివాసి సలావుద్దీన్ మన్సూరి (35) విగతజీవిగా ఉన్న నాగుపాముతో సహా ఆసుపత్రిలోని అత్యవసర వార్డులోకి ప్రవేశించాడు. దీంతో అక్కడి వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పాముతో పాటు వెళ్లిన సలావుద్దీన్.. పాము కాటువేయడంతో చనిపోయిందని వైద్యులకు తెలిపాడు. పాము తన పాదాలు, చేతిపై రెండుసార్లు కాటు వేసిందని, ఆ తర్వాత చనిపోయిందని వెల్లడించాడు. పాము దాదాపు మూడు అడుగుల పొడవు ఉంది. దాన్ని పాలిథిన్ కవర్‌లో ఉంచి ఆస్పత్రికి వెళ్లాడు. పాము కాటుకు చికిత్స చేసేందుకు యాంటీ వీనమ్‌ ఇంజక్షన్ ఇవ్వాలని మన్సూరి వైద్యులను కోరాడు. అసలు అతన్ని, కోబ్రాను చూసిన డాక్టర్‌ షాక్‌లో వుండిపోయాడు.

మందుబాబు.. కింగ్ కోబ్రాతో ఆసుపత్రిలో హంగామా వీడియో ఇదే