తరగతి గది ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఆ గదిలో చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఈ జ్ఞాపకాలలో కొన్ని చేదువి, మరి కొన్ని మధురమైనవి. అయితే తరగతిలో అప్పుడప్పుడూ జరిగే గొడవలను ఫైట్స్‌ని క్లాస్‌మేట్స్‌తో సహా అందరూ ఎంజాయ్‌మెంట్‌తో చూసే విధంగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
READ MORE: YS Jagan: నెల రోజుల్లో ఇసుకను దోచేశారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
వీడియో ప్రకారం.. ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవలో కారణంగా మధ్యలో ఉన్న ఓ అబ్బాయికి హఠాత్తుగా కోపం వచ్చింది. కోపోద్రిక్తుడైన కుర్రాడు ఒక్కసారిగా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవర కొండలా మారాడు. అది చూసి ఇతర విద్యార్థులు నవ్వుతుంటే.. అక్కడ గొడవ పడుతున్న అమ్మాయిలిద్దరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఇంటర్నెట్ వినియోగదారులు కూడా ఈ వీడియోపై భారీగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇద్దరు అమ్మాయిలు ఎందుకో గొడవ పడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఇంతలో పక్కనే కూర్చున్న కుర్రాడికి ఒక్కసారిగా కోపం వచ్చి బ్యాగ్ విసిరి సీట్లోంచి లేచి నిలబడ్డాడు. కోపంతో.. బాలుడు అకస్మాత్తుగా ఆ డెస్క్‌పై రెండు గుద్దులు గుద్దాడు. అతను ఇలా చేయడం చూసి గొడవ పడుతున్న అమ్మాయిలు ఒక్కసారిగా ప్రశాంతంగా అయిపోతారు. ఎదురుగా నిలబడి ఉన్న ఇతర అబ్బాయి అతన్ని పట్టుకుని నియంత్రిస్తాడు. ఈ వీడియో ఒక కోచింగ్ సెంటర్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి డెస్క్ వద్ద కూర్చున్నారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసి “తరగతి గది ఇబ్బందులు” అని రాసుకొచ్చాడు. ఈ వీడియోకు 2.5 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. వందలాది మంది కామెంట్లు చేస్తున్నారు.
Class-Room Ke Kalesh
pic.twitter.com/7Wen3IcxCM— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024