Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
- కారు తలుపులను బద్దలుకొట్టిన హ్యూమనాయిడ్ రోబో
- కత్తి దాడిని అడ్డుకునేలా అద్భుత విన్యాసాలు
- ఎనిమిది గంటల స్టాండ్‌బై సామర్థ్యం ఉందని కంపెనీ వెల్లడి
- వైరల్ వీడియోపై నెటిజన్ల ప్రశంసలు.. ఆందోళనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాంకేతిక రంగంలో రోజురోజుకూ అద్భుతాలు సృష్టిస్తున్న చైనాకు చెందిన ప్రముఖ ‘యూనిట్రీ రోబోటిక్స్’ (Unitree Robotics) సంస్థ మరో సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘యూనిట్రీ హెచ్2-ఎక్స్ కుంగ్ ఫూ లెజెండ్ గార్డియన్’ (H2-X Kung Fu Legend Guardian) పేరుతో రూపొందించిన ఈ అత్యాధునిక రోబోకు సంబంధించిన డెమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోబో చేస్తున్న విన్సెంట్లు చూస్తుంటే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపిస్తున్నాయి.
అత్యంత శక్తివంతమైన విన్సెంట్లు.. అవాక్కవుతున్న నెటిజన్లు
యూనిట్రీ సంస్థ విడుదల చేసిన ఈ ప్రమోషనల్ వీడియోలో రోబో చేసిన విన్సెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కారు తలుపులను తన్ని బద్దలుకొట్టడం, దాదాపు 4 మీటర్ల ఎత్తు నుంచి ఎలాంటి నష్టం జరగకుండా కిందకు దూకడం, కత్తితో దాడికి వస్తున్న వ్యక్తిని నిరాయుధుడిని చేయడం, అంతేకాకుండా ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు కారును పైకి ఎత్తడం వంటి సాహసోపేతమైన విన్సెంట్‌లను ఈ రోబో అవలీలగా చేసి చూపింది. “శక్తివంతమైన పనితీరుతో మీకు రక్షణగా నిలిచేందుకు యూనిట్రీ హెచ్2-ఎక్స్ సిద్ధమైంది. దీని బ్యాటరీ స్టాండ్‌బై సామర్థ్యం దాదాపు 8 గంటలు ఉంటుంది. దయచేసి రోబోను సురక్షితమైన రీతిలో ఉపయోగించండి” అంటూ కంపెనీ ఈ వీడియోను షేర్ చేసింది.
Also Read
- Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
- Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
స్పష్టతనివ్వని కంపెనీ.. ధరపై అంచనాలు
ప్రస్తుతం ఈ వీడియోకు సోషల్ మీడియాలో సుమారు 10 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. అయితే, ఈ వీడియోలో రోబో చేసిన విన్సెంట్లన్నీ పూర్తిగా ఆటోమేనస్గా (స్వయంప్రతిపత్తితో) జరిగాయా? లేదా రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేశారా? అనే దానిపై యూనిట్రీ సంస్థ ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. అలాగే రెస్క్యూ లేదా పోరాట సమయాల్లో బ్యాటరీ పనితీరు ఎలా ఉంటుంది, దీని అసలు ధర ఎంత, మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలను కూడా కంపెనీ వెల్లడించలేదు. కాగా, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న యూనిట్రీ హెచ్2 (H2) మోడల్ ప్రారంభ ధర సుమారు 29,900 అమెరికన్ డాలర్లుగా ఉంది.
వైరల్ వీడియోపై భిన్నాభిప్రాయాలు
ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రోబోల కదలికలు మనుషులను తలపించేలా మరింత వేగంగా, అద్భుతంగా మారుతున్నాయని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ “ఇది నిజం కాకపోతే బాగుండు, కేదలం కల అయితే బాగుండను” అని కామెంట్ చేశారు. మరోవైపు, రోబోలకు హింసాత్మక విన్సెంట్లు నేర్పడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పేదల కోసం ఇళ్లు కట్టడం, వేర్‌హౌస్‌లలో సాధారణ పనులు చేయడం వంటి ఎన్నో ఉపయోగకరమైన పనులు ఉండగా, రోబోలను హింసాత్మక పనుల కోసం ఎందుకు శిక్షణ ఇస్తున్నారంటూ కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
తాజావార్తలు
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!
-
Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
-
Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
-
India vs New Zealand: కివీస్ గడ్డపై తెలుగోళ్ల విధ్వంసం.. భారత్ ఖాతాలో మరో రికార్డ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!