NTV Telugu Site icon

Haryana: వీర్యం విక్రయం ద్వారా నెలకు రూ. 5 లక్షలు.. మనిషిది కాదు..

Buffalo

Buffalo

హర్యానాలోని సిర్సా జిల్లాలో ఒక అసాధారణ గేదె నివసిస్తుంది. దాని పేరు అన్మోల్. పేరుకు తగ్గట్టుగానే ఈ దున్నపోతు ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. 1500 కిలోల బరువున్న ఈ గేదె భారీ ఎత్తు, విలాసవంతమైన జీవనశైలి కారణంగా చర్చనీయాంశంగా మారింది. అది తన పరిమాణానికే కాకుండా విలాసవంతమైన జీవనశైలికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పుష్కర జాతరలో ప్రదర్శించబడింది. ఈ గేదె మీరట్‌లో జరిగిన ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్‌లో కూడా పాల్గొంది. దాని హైక్వాలిటీ వీర్యానికి విపరీతమైన డిమాండ్ ఉందని అంటున్నారు. అన్మోల్ ధర 23 కోట్లు. దాదాపు ఈ ధర రెండు రోల్స్ రాయిస్ కార్లు లేదా పది మెర్సిడెస్ బెంజ్ కార్లతో సమానం.

READ MORE: IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితా విడుదల.. 13 ఏళ్ల వయస్సులోనే..

ఈ గేదె సాధారణ గేదె మాత్రమే కాదు. దీనిని రాజ పద్ధతిలో పెంచుతారు. ఈ ఎనిమిదేళ్ల గేదె సంరక్షణ, ఆహారం విషయంలో రాజు కంటే తక్కువేం కాదు. అన్మోల్ రోజువారి ఖర్చు రూ.1500. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అన్మోల్ ప్రతిరోజూ 250 గ్రాముల బాదం, 4 కిలోల దానిమ్మ, 30 అరటిపండ్లు, 5 లీటర్ల పాలు, 20 గుడ్లు తింటుంది. ఇది కాకుండా, అన్మోల్‌కు ఆయిల్ కేక్, పచ్చి మేత, నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్న కూడా తినిపిస్తారు. అన్మోల్ రోజుకు రెండుసార్లు విలాసవంతంగా స్నానం చేస్తారు. బాదం, ఆవాల నూనెతో మసాజ్ చేస్తారు. అన్మోల్ తల్లి కూడా ప్రత్యేకమైనది. అది రోజుకు 25 లీటర్ల పాలు ఇచ్చేది.

READ MORE: Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే

అన్మోల్ యొక్క వీర్యం దాని యజమానికి “బంగారు గుడ్డు” అని పిలుస్తాడు. దాని వీర్యం ప్రతి వారం రెండుసార్లు తీస్తారు. అన్మోల్ యజమాని గిల్ ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా దాదాపు రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అయితే యజమాని అన్మోల్‌ను చాలా గౌరవిస్తాడు. తన సోదరుడిలా భావిస్తాడు. వారికి అన్మోల్ కేవలం గేదె మాత్రమే కాదు.. కుటుంబంలో ఒక భాగం.

Show comments