Site icon NTV Telugu

Biker Stunts In Front Police Jeep: బీహార్ హైవేపై బైక్ స్టంట్లు.. పోలీస్ వాహనం ముందే విన్యాసాలు

Bihar

Bihar

Bike Stunts In Front Police Jeep: బీహార్‌లో హైవేపై కొందరు యువకులు చేసిన ప్రమాదకర బైక్ స్టంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రద్దీగా ఉన్న రహదారిపై ప్రాణాలను లెక్క చేయకుండా వారు చేసిన విన్యాసాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు స్పందించి స్టంట్ చేసిన బైకర్లపై కేసు నమోదు చేశారు. కాగా, సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోలో వేగంగా దూసుకెళ్తున్న బైక్‌పై ఇద్దరు యువకులు నిలబడి, చేతులు పట్టుకుని ప్రయాణించడం కనిపిస్తోంది. ట్రక్కుకు అతి సమీపంగా వెళ్తూ ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేయడం అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. స్టంట్ల మధ్యలోనే బీహార్ పోలీస్ జీప్‌ను కూడా దాటి వెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

Read Also: Silver Rates: మళ్లీ షాకిచ్చిన సిల్వర్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

అయితే, బీహార్ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదకర డ్రైవింగ్ నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బైకర్లు, వాహనాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు భద్రతే తమ ప్రధాన లక్ష్యం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్షలు విధిస్తామని వెల్లడించారు. ఈ సంఘటన బీహార్‌లో రోడ్డు భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిర్లక్ష్యంగా చేసే బైక్ స్టంట్లు కేవలం స్టంట్ చేసిన వారికే కాకుండా రహదారిపై ప్రయాణిస్తున్న అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచడం, కఠిన చట్టాలు అమలు చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని ప్రజలు సూచిస్తున్నారు. మరోవైపు, వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. “పోలీసులు అంటే భయమే లేకుండా రహదారిపై విన్యాసాలా?”, “నంబర్ ప్లేట్ ఆధారంగా గుర్తించి బైక్ స్వాధీనం చేసుకోవాలి”, “ఇలాంటి వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండకూడదు” అంటూ కామెంట్స్ పెట్టారు.

Exit mobile version