Biker Stunts In Front Police Jeep: బీహార్ హైవేపై బైక్ స్టంట్లు.. పోలీస్ వాహనం ముందే విన్యాసాలు
- బీహార్‌లో హైవేపై కొందరు యువకులు చేసిన ప్రమాదకర బైక్ స్టంట్లు..
- రద్దీగా ఉన్న రహదారిపై ప్రాణాలను లెక్క చేయకుండా వారు చేసిన విన్యాసాలు..
- పోలీస్ జీప్ ముందే విన్యాసాలు చేసిన బైక్ స్టంట్లు చేసిన ఇద్దరు యువకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Stunts In Front Police Jeep: బీహార్‌లో హైవేపై కొందరు యువకులు చేసిన ప్రమాదకర బైక్ స్టంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రద్దీగా ఉన్న రహదారిపై ప్రాణాలను లెక్క చేయకుండా వారు చేసిన విన్యాసాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు స్పందించి స్టంట్ చేసిన బైకర్లపై కేసు నమోదు చేశారు. కాగా, సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోలో వేగంగా దూసుకెళ్తున్న బైక్‌పై ఇద్దరు యువకులు నిలబడి, చేతులు పట్టుకుని ప్రయాణించడం కనిపిస్తోంది. ట్రక్కుకు అతి సమీపంగా వెళ్తూ ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేయడం అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. స్టంట్ల మధ్యలోనే బీహార్ పోలీస్ జీప్‌ను కూడా దాటి వెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
Read Also: Silver Rates: మళ్లీ షాకిచ్చిన సిల్వర్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
- Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
అయితే, బీహార్ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదకర డ్రైవింగ్ నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బైకర్లు, వాహనాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు భద్రతే తమ ప్రధాన లక్ష్యం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్షలు విధిస్తామని వెల్లడించారు. ఈ సంఘటన బీహార్‌లో రోడ్డు భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిర్లక్ష్యంగా చేసే బైక్ స్టంట్లు కేవలం స్టంట్ చేసిన వారికే కాకుండా రహదారిపై ప్రయాణిస్తున్న అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచడం, కఠిన చట్టాలు అమలు చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని ప్రజలు సూచిస్తున్నారు. మరోవైపు, వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. “పోలీసులు అంటే భయమే లేకుండా రహదారిపై విన్యాసాలా?”, “నంబర్ ప్లేట్ ఆధారంగా గుర్తించి బైక్ స్వాధీనం చేసుకోవాలి”, “ఇలాంటి వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండకూడదు” అంటూ కామెంట్స్ పెట్టారు.
रील बनाने के लिए बाइक से स्टंट कर अपनी एवं दूसरे की जान जोखिम में न डालें।
ऐसा करना एक दंडनीय अपराध है।
.
.#BiharPolice #bihartrafficpolice #roadsafety #FollowTrafficRules #safedriving #Bihar #bikestunt @BiharHomeDept @IPRDBihar @motihari_police pic.twitter.com/qO6PJC5XVp— Bihar Police (@bihar_police) January 15, 2026
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..