Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు భలే మజా అందిస్తాయి. అలాంటి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ పక్షి వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ రిపోర్టర్ తన ఛానల్‌కు లైవ్ రిపోర్టింగ్ ఇస్తుంటాడు. అది కూడా దొంగతనాలపై రిపోర్టింగ్ ఇస్తుండగా ఇంతలోనే ఓ పక్షి అతని చెవి నుంచి ఇయర్ ఫోన్స్ కొట్టేయడం విచిత్ర సంఘటనగా నిలిచింది. ఈ ఘటన చిలీలో చోటుచేసుకుంది. దేశంలో పెరిగిపోతున్న దొంగతనాలపై చిలీ జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ లైవ్ రిపోర్ట్ ఇస్తున్నాడు. టీవీలో వరుస దొంగతనాలపై రిపోర్టర్ వివరాలు చెబుతుంటే టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. ఇంతలో ఓ రామచిలుక ఎగురుకుంటూ వచ్చి ఆ రిపోర్టర్ భుజంపై వాలింది.
Read Also: Samantha: సెలైన్ పెట్టుకొని మరీ ఆ పని కానిచ్చేసిన సామ్..
అయినా రిపోర్టర్ మాత్రం చిలుకను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. చిలుక చూసి చూసి ఆయన చెవిలో ఉన్న ఇయర్ బడ్ ను నోట కరుచుకుని ఎగిరిపోయింది. ఇదంతా లైవ్ టెలికాస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనపై కాస్త ఆలస్యంగా స్పందించిన రిపోర్టర్.. తన ఇయర్ బడ్‌ను తిరిగి పొందడం కోసం చిలుకను పట్టుకుందామని ప్రయత్నించినా దొరకలేదు. కొంత దూరంలో చిలుక ఇయర్ బడ్‌ను పడేసింది. తర్వాత అక్కడికి దగ్గర్లోనే ఇయర్ బడ్ దొరికిందని రిపోర్టర్ వెల్లడించాడు. ఈ వీడియో చూసిన చాలా మంది దొంగతనాలపై రిపోర్టర్ రిపోర్టింగ్ చేయడం పక్షికి నచ్చలేదు కాబట్టే దొంగతనం చేసిందంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Beware the earphone pinching parrots 🦜 of #Huddersfield, @AndrewVossy… 😂@RLWC2021 #RLWC2021 pic.twitter.com/BXtLoHujYo
— Jayne Halhead 🇺🇦 (@Jaynes__World) November 5, 2022