Site icon NTV Telugu

Cockroach Coffee: చచ్చిన బొద్దింకలు, పురుగులతో కమ్మని కాఫీ..! ధర జస్ట్ రూ. 500! ఎక్కడో తెలుసా..?(వీడియో)

Coffee

Coffee

Coffee Topped With Powdered Cockroach: చైనా వంటకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీటకాలు, పురుగులు, పాములు, పక్షులు, జంతువులు ఇలా వేటినీ వదలకుండా మింగేస్తుంటారు. అయితే.. తాజాగా చైనా రాజధాని నుంచి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌లోని ఒక కీటకాల నేపథ్య మ్యూజియం కాఫీని గమ్మత్తుగా తయారు చేసింది. కాఫీలో బొద్దింక పొడి, ఎండిన పురుగుల లార్వాల మిశ్రమం కలిపి అక్కడి జనాలకు నచ్చేలా అద్భుతంగా తయారు చేశారు. ఈ
అసాధారణ చైనీస్ కాఫీని భారతీయులు మాత్రం తాగలేరు.

READ MORE: Baby Selling Case: ప్రేమించినోడు మోసం చేశాడు.. కడుపులో ఉన్న బిడ్డనే అమ్మకానికి పెట్టిన యువతి..!

దీన్ని రుచి చూసిన వారు ప్రత్యేకమైన అనుభవంగా అభివర్ణించారు. పుల్లని, కొద్దిగా మట్టి రుచి కలిగి ఉందని చెబుతున్నారు. దీని ధర కూడా తక్కువేం కాదండో.. దాదాపు 45 యువాన్లు.. అంటే సుమారు 500 రూపాయలు. ప్రస్తుతం ఈ కాఫీ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెనూలో బొద్దింక కాఫీ ఒక్కటే ఎంపిక కాదు.. కానీ ఇతర అనేక ఎంపికలు సైతం ఉన్నాయి. మెనూ చూడటానికే భయానకంగా ఉంటుంది. కాకరకాయ జీర్ణ రసాలతో తయారు చేసిన కాఫీ. ప్రత్యేక చీమల పానీయం చాలా ప్రత్యేకమట. అయితే.. ఈ ప్రత్యేక కాఫీలు చూడటానికి అసహ్యంగా ఉన్నప్పటికీ.. తాగడం చాలా సులభమని చెబుతున్నారు. గీరాకీ సైతం బాగానే ఉందట. గంటల్లోనే స్టాక్ అయిపోతుంది. కీటకాల సారాలను కలిగి ఉన్న పరిమిత-ఎడిషన్ పానీయాలు కూడా విక్రయిస్తున్నారు. ఈ వింత పానీయాలను యువకులు, వ్లాగర్లు ఎక్కువగా ప్రయత్నిస్తారు. వారికి, ఇది “షాక్ వాల్యూ డ్రింక్” కోసం సరైన కంటెంట్‌గా మారింది.

READ MORE: Delhi: ఢిల్లీలో మరో ఉలిక్కిపాటు.. భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం

Exit mobile version