NTV Telugu Site icon

AR.Rahaman: ఏఆర్ రెహమాన్ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Ar Rahman

Ar Rahman

ఏఆర్ రెహమాన్.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు..భారతీయ ప్రముఖ దర్శకుడు ఈయన..ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను తన గాత్రంతో అలరించారు. ఎంతమంది సింగెర్స్ వస్తున్నా కూడా రెహమాన్ పాటలంటే జనాలకు తెగ ఇష్టం.. టీవీ లకు అతుక్కుపోతారు..ఇక ఎంతోమంది సింగర్స్ కూడా ఒక్కో పాటకి షాక్ ఇచ్చే అంత రెమ్యూనరేషన్లు కూడా తీసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి గాయని గాయకుల స్వరాలు వారి పేర్లు చాలా పాపులారిటీ కావడం వల్ల కొంతమంది ఒక్కో పాటకు రూ .20 లక్షల మించి వసూలు చేస్తున్నట్లు సమాచారం..

మామూలు సింగర్స్ అంత తీసుకుంటే రెహమాన్ రేంజుకు ఎంత తీసుకోవాలి.. ఆయన ఒక్కో పాటకి మూడు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడని తెలుస్తుంది.. అగ్ర గాయకులు అందించే సగటు మొత్తం కంటే దాదాపుగా పది రెట్లు మొత్తాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. చాలామంది గాయకులు ఇండియా పరిశ్రమలు కేవలం ఒక్కో పాటకి.. రూ.5 నుంచి రూ.10 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.మరి కొంతమంది రూ.20 లక్షల వరకు ప్యాకేజీని అందుకోవడం జరుగుతోంది..ఈ విషయం చాలా మందికి తెలియదు.

అయితే ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ మాత్రం ఒక్కో పాటకు సింగర్ కంపోజర్ హోదాలో దాదాపుగా మూడు కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్నిసార్లు ఈ రెమ్యూనరేషన్ కూడా మారుతూ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాలో ఈ తరహా లో ఏ సింగర్ కు లేదనే చెప్పాలి.. సాంగ్ తో పాటు స్టేజ్ పై స్టెప్పులు వేస్తే కోటి రూపాయలు కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది.. ఇక ఏఆర్ రెహమాన్ తర్వాత ఇండియాలో అత్యధికంగా పారితోషకం అందుకుంటున్న వారిలో శ్రేయ ఘోషల్.. ఒక్కో పాటకి రూ.25 లక్షలు వసూలు చేస్తున్నారు.. ఆ తర్వాత సూదిని చౌహన్.. అర్జిత్ సింగ్.. ఒక్కో పాటకు 20 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. వీరే కాకుండా ఇతర గాయకులు సైతం ఒక్కో పాటకి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి…