NTV Telugu Site icon

US video: ఎయిర్‌పోర్టులో మహిళ వీరంగం.. నేలకేసికొట్టిన కంప్యూటర్, ఫోన్

Usvideo

Usvideo

అమెరికా ఎయిర్‌పోర్టులో ఒక మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. సిబ్బందిపై భౌతికదాడికి పాల్పడింది. అంతేకాకుండా చేతికి దొరికిన వస్తువుల్ని విసిరేసింది. అరుపులు, కేకలతో నానా రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Jay Shah: క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన జై షా..

చికాగోలోని ఓ హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జూలైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికురాలి కుటుంబ సభ్యులు ఎక్కాల్సిన ఫ్లైట్ వెళ్లిపోయింది. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకొచ్చింది. దీంతో మహిళా ప్రయాణికురాలు.. ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌పై రుసరుసలాడిపోయింది. బ్యాగేజీ కౌంటర్‌పైకి ఎక్కి సిబ్బందిపై దాడికి పాల్పడింది. అంతేకాకుండా అక్కడే ఉన్న కంప్యూటర్‌ను విసిరేసింది. అంతేకాకుండా పెద్ద పెద్దగా అరుస్తూ స్టుపిడ్ అంటూ కేకలు వేసింది. అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు మొబైల్‌లో చిత్రీకరించి జూలై 30న సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన తర్వాత ప్రయాణికురాలి కుటుంబం జారుకుంది.

ఇది కూడా చదవండి: Independence Day : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 18 మంది సీబీఐ అధికారులకు పోలీస్ మెడల్స్

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. మహిళా ప్రయాణికురాలు ఎయిర్‌పోర్టులో వీరంగం సృష్టించిందన్నారు. సెల్‌ఫోన్‌ కూడా విసిరేసింది. ఒకరిపై భౌతికంగా దాడి చేసిందని.. మరొక మహిళ కాలుకు గాయం అయిందన్నారు. ఘటన తర్వాత ప్రయాణికురాలు విమానాశ్రయం నుంచి పరారైందని తెలిపారు. మహిళ పాస్‌పోర్టు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

Show comments