ఆనంద్ మహీంద్రా బిజినెస్ రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం అందుబాటులో ఉంటారు. మట్టిలోని మాణిక్యాలను తన సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు. తాజగా ఆనంద్ మహీంద్రా పంజాబ్ లోని అమృత్‌సర్‌లోని ఓ రెస్టారెంట్ గురించి ట్వీట్ చేశారు. మూడు నెలల క్రితం అమృత్‌సర్‌లోని సుల్తాన్ గేట్ వద్ద ఓ చిన్న రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. అయితే, దాని యజమాని హఠాత్తుగా చనిపోవడంతో 17, 11 ఏళ్ల చిన్నారులు ఆ రెస్టారెంట్ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. రెస్టారెంట్ కు సంబంధించిన విషయాలు తెలియకున్నా, అనుభవం లేకున్నా వారు రెస్టారెంట్‌ను నడపడం మొదలుపెట్టారు.
Read: కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తల కీలక పరిశోధన…
వీరి గురించి తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా ఆ హోటల్ గురించి ట్వీట్ చేశారు. అమృత్‌సర్ వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆ రెస్టారెంట్‌కు వెళ్లాలని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్రా ట్వీట్ తరువాత ఆ రెస్టారెంట్‌కు వస్తున్న వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరిగింది. తాను అమృత్‌సర్ వెళ్లిన సమయంలో తప్పకుండా ఆ రెస్టారెంట్‌కు వెళ్తానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
